[:te]జూలై -23 చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) జయంతి.సందర్భంగా.[:]

  • Post author:
  • Post published:July 23, 2017
  • Post category:Celebrities
  • Post last modified:July 23, 2017

[:te]

చంద్రశేఖర్ అజాద్

చంద్రశేఖర్ సీతారాం తివారి (ఆజాద్)
జూలై 23, 1906–ఫిబ్రవరి 27, 1931

చంద్రశేఖర్ ఆజాద్
జన్మస్థలం: బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
నిర్యాణ స్థలం: అలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారతదేశం
ఉద్యమము: భారత జాతీయ ఉద్యమం
ప్రధాన సంస్థలు: నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్

చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931) భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు.

బాల్యము

మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసిలో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు.

అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున సంస్కృత పాఠశాలముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితేజైలు అని తల తిక్క సమాదానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించాడు.

ఇతని తలతిక్క సమాదానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ …. చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.

విప్లవము … ఉద్యమాలు

తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్, అఘ్నూల్ల ఖాన్, రోషన్ సింగ్ లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి ఆకోరి అనే వూరు వద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోపిడి చేశారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్ర శేఖర్ అజ్ఞాత వాసంలోకి వెళ్ళి పోయాడు.

రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువుగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం పై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాలికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు.

చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబరులో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్వక్తి స్కాట్ అనుకొను సాండర్స్ అనే పోలీసును కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురు లను చనన్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకో గలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోడానికి చనన్ సింగ్ను కాల్చక తప్పలేదు.

తమ రహస్యజీవనంలో భాగంలో ఝాన్సీ పట్టణంలో సహ విప్లవ కారులతో కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణానంతా గాలిస్తున్నారు. అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో వుంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టు పోలీసులను మొహరించి ఒక ఉదుటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. కాని ఖాలీగా వున్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది జరిగింది 1929 మే నెల 2వ తారీఖున.

పార్లమెంటు పై దాడి కేసు

ఈలోపు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.

దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పారుకులో తమ ఇతర విప్లవ మిత్రులత భగత్ సింగ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది ఆజాద్ కి. వెంటనే తన రివ్వార్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనె ఉన్నారు. ఆజాద్ వారిని తన రివ్వాల్వర్తో నిలవరిస్తూనే ఉన్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానె మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. చీ బ్రిటిష్ వారికి తాను పట్టుబడటమఅంతే మరో క్షణం ఆలోసించ లేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది. అంత 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు.

చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) 1906 జూలై 23 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు . ఈయన భారతీయ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమర యోధుడు – చంద్రశేఖర్‌ అజాద్. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు…చంద్రశేఖర్ అజాద్.కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుదాం .

సీతారాం తివారీ, జగరాణి దేవీల ఐదో సంతానంగా జన్మించిన చంద్రశేఖర్‌ అజాద్‌ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచి ధైర్యసాహసాలు చూపేవారు. ప్రజల నుంచి మహాత్మాగాంధీ వరకు నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. 1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్‌ కూడా జనంతో కలిసి వందేమాతరం విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాల చేస్తుంటే పోలీసులు కొట్టారు. ఇది సహించలేక రాయిని గురి చూసి పోలీసులను కొట్టి అదృశ్యమయ్యాడు. బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా 1857లో స్వాతంత్ర్య సమరజ్వాలలు ఎగసిపడినాయ. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్ధించేవరకూ గడచిన 90 ఏళ్లలో దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. పంజాబ్‌లో రామసింగ్ కూకా (నాంధారీ ఉద్యమం), మహారాష్టల్రో వాసుదేవ బల్వంత్‌ఫడ్‌కే, ఛపేకర్ సోదరులు, భగత్‌సింగ్, యస్ఫతుల్లాఖాన్, రాజగురు, రాంప్రసాద్, బిస్మిల్, భగవతీచరణ్, అల్లూరి సీతారామరాజు, కుమరంభీం, చంద్రశేఖర్ అజాద్.. ఇంకా అనేకమంది వీరుల బలిదానాలు కొనసాగాయి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల కడుపుపంటగా చంద్రశేఖర్ తివారీ జన్మించాడు. ఆయనే చంద్రశేఖర్ అజాద్. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్ర సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్.15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైనవాడు చంద్రశేఖర్ అజాద్.

 

తనను విచారిస్తున్న బ్రిటిష్ న్యాయాధికారి ఖరేఘాట్‌కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది- ‘‘నీ పేరేమిటి?’’ ‘‘ నా పేరు అజాద్,’’ ‘‘ తండ్రి పేరు’’ ‘‘స్వాధీన్,’’ ‘‘నీ ఇల్లెక్కడ’’ – ‘‘కారాగృహం.’’ ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. కోర్టులో సందర్శకులనుంచి ‘భారత్  మాతాకీ జై’ నినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుగారే ముఖవర్చస్సుకల ఆ బాలుడిని చూస్తూ కూడా అధికార దర్పంతో ‘16 కొరడాల దెబ్బలు’ అంటూ శిక్ష ప్రకటించాడు.నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే.. ఆ బాలుని శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినపుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటున్నాడు. ఆనాడు కాశీ ప్రజలు ఆ బాలుని ‘అజాద్’ అని పిలిచారు. అదే అతడి సార్థక నామధేయం అయింది. శిక్షానంతరం, సేద తీర్చుకోమని (ఇది మరో అవమానం!) మూడు అణాలు ఇవ్వడం రివాజు. ఆ మూడు అణాలు విసిరి వారి ముఖాన కొట్టాడు అజాద్. బ్రిటిష్ పాఠశాల చదువు ఇష్టంలేని అజాద్ కాశీలో సంస్కృత విద్యాలయంలో చేరాడు.

ఆరోజుల్లోనే విప్లవ వీరుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది. అజాద్ జీవితంలో అదో పెద్ద మలుపు. బిస్మిల్ అడుగుజాడల్లో విప్లవ శంఖం పూరించాడు. ఉద్యమానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలడానికి తిరుగుబాటే మార్గం అవుతుందని సంకేతాలు ప్రజలకు అందించడం- ఆశయంగా పెట్టుకుని 1925లో జరిగిన కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాడు. ఈ కేసులో బ్రిటిష్ ప్రభుత్వం రాంప్రసాద్ బిస్మిల్‌తో సహా యస్ఫతుల్లాఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్‌సింగ్‌లను, బూటకపు విచారణ జరిపి ఉరితీసింది. మన్మధ దాస్‌గుప్తా, జోగీంద్ర చటర్జీ, ముకుందలాల్, రామకృష్ణ ఖత్రలకు పది పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అజాద్ మాత్రం తప్పించుకున్నాడు. ఆ తర్వాత అజాద్ మారువేషాలలో అనేక ఊళ్లు తిరిగాడు. వివిధ విప్లవ సంస్థలతో సంపర్కం పెట్టుకున్నాడు. తదుపరి ఫిరోజ్‌షా కోట్లలో భగత్‌సింగ్, భగవతీచరణ్, శివశర్మ, మరికొందరు విప్లవ వీరులతో కలిసి 1928 సెప్టెంబరు 8న ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మి’ స్థాపించడం జరిగింది. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1929లో లాహోర్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి జరిపాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంజాబ్ కేసరి నేలకొరిగాడు. విప్లవ వీరులు చూస్తూ ఊరుకోలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆగ్రహంతో రగిలిపోతూ సాండర్స్‌ను హతమార్చారు. 1929 జూలై 10న సాండర్స్ హత్యకేసు విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం 32మందిపై నేరం మోపింది. ఆ బూటకపు విచారణానంతరం అజాద్‌తోసహా తొమ్మిదిమందిని పరారీలో వున్నారని ప్రకటించింది.

ఆత్మార్పణం

1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఓ చెట్టుకింద అజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డితిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. నాలుగు వ్యాన్‌లలో పోలీసులను ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్ట్‌బావర్, విశే్వశ్వర సిన్నాహలు ఆల్‌ఫ్రెడ్ పార్క్‌కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ అజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా, బాధను లెక్కచేయక అజాద్ తన రివాల్వర్‌తో లార్ట్ బావర్‌ను కాల్చాడు. విశే్వశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా అజాద్ కుడిచేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి వున్న పోలీసు బలగాలు గుళ్ల వర్షం కురిపిస్తుండగా అజాద్ తన రివాల్వర్‌తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్‌లో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకు పోయేందుకు సహకరించాడు. ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వనె్న తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ.

[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.