You are currently viewing National Voters Day

National Voters Day

  • Post author:
  • Post published:January 25, 2020
  • Post category:Day to Day
  • Post last modified:January 25, 2020

National Voters’ Day

9వ జాతీయ ఓటర్ల దినోత్సవం

జాతీయ ఓటర్ల దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఏర్పాటు

ఇది జనవరి 25, 2011 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ స్టేషన్లలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది.

9వ జాతీయ ఓటర్ల దినోత్సవరం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఏ ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో జనవరి 2011 జనవరి 25 నుండి ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవాన్ని ఈసీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జనవరి 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఓటుహక్కు లేనివారు, జాబితాలో పేర్లు గల్లంతైనవారు, మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వయోజనులందరు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. దరఖాస్తులను, అభ్యంతరాలు, ఫిర్యాదులను ఫిబ్రవరి 11వ తేదీలోగా పరిష్కరించి, ఫిబ్రవరి 22న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో లేదా ఎమ్మార్వో కార్యాలయాలు, పోలింగ్ బూత్‌లవారీగా ఎన్నికల అధికారులు నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.80 కోట్ల మంది ఓటర్లున్నారు. తాజా ఓటరు నమోదు ప్రక్రియలో మరో 20 లక్షల మంది నమోదవుతారని అంచనా. దీన్ని బట్టి తుది జాబితా లో రాష్ట్ర ఓటర్లు మూడు కోట్లు దాటుతారని అధికారులు చెప్తున్నారు.

ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని మరియు ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram
Email

Comments

comments