Budget 2022

  • Post author:
  • Post published:February 1, 2022
  • Post category:Notifications
  • Post last modified:February 1, 2022

Budget 2022

2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సమర్పించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ 2022–23ను ఆవిష్కరించారు. నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా నాలుగో బడ్జెట్‌.
భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇంధిరా గాంధీ ఇంధిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్‌ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎక్కువ సార్లు(నాలుగు సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్‌.
  •  మొత్తం బడ్జెట్‌ 39 కోట్ల 45 లక్షలు.
  • ద్రవ్యలోటు 6.9శాతం.
  • 2025- 26నాటికి ద్రవ్యలోటుని 4.5శాతానికి తగ్గించడమే లక్ష్యమని తెలిపారు నిర్మలా సీతారామన్‌.
  •  రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
  •  రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
  • ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా
  • 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా
  • 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు
  • రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు
  • ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్‌ ఉండగా.. వీటిని 200 కి పెంపు
  • 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌
  • 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్‌ బ్యాంక్స్‌)
  • అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు
  • ప్రధాని ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం
  • అర్బన్‌ ఏరియాలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్‌ ఉపయోగిస్తాం
  • పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్‌ ఏర్పాటు
  • వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్‌ రైళ్లు
  • దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ నిర్మాణం
  • 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం
  • మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన
  • డిజిటల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం
  • వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు 
  • పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం
  • రూ250 కోట్లుతో 5 విద్యా సంస్థల ఏర్పాటు
  • ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే
  • అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం
  • త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5 జి స్ప్రెక్టమ్‌ వేలం
  • 2025 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పూర్తి
  • పీపీపీ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబులింగ్‌
  • ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్‌ఈజెడ్‌లో సమూల మార్పులు
  • ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం
  • రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలు
  • రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్‌ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం 
  • డిఫెన్స్‌ బడ్జెట్‌లో 25 శాతం డిఫెన్స్‌ రీసెర్చ్‌ కోసం కేటాయింపులు
  • పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు
  • ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు
  • సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19500 కేటాయింపులు
  • 10 రంగాల్లో క్లీన్‌ ఎనర్జీ యాక్షన్‌ ప్లాన్‌
  • ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
  • వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
  • పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలు
  • ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • నిధుల సమీకరణకు సావర్‌ గ్రీన్‌ బాండ్ల 
  • త్వరలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
  • 2022–23లోనే అమల్లోకి డిజిటల్‌ కరెన్సీ
  • డిజిటల్‌ కరెన్సీ కోసం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ
  • ఎలక్ట్రికల్‌ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు
  • త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం
  • ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు
  • పెట్రో డీజిల్‌ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం
  • వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వద్ధిరేటులో మనం ముందున్నాం.
  • దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు నిర్మల తెలిపారు.
  • వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.
  • చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్‌ వన్‌ప్రొడక్ట్‌ పథకం అమలు 
  • 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు
  • రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు – భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ 
  • వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు
  • చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌
  • వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి
  • దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం
  • కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక
  • ఇన్కం ట్యాక్స్‌ ఫైలింగ్‌ మరింత సులభతరం, రెండేళ్ల దాకా రిటర్స్‌ ఫైల్‌ చేసుకునే అవకాశం.
  • ఇకపై డిజిటల్‌ పాస్‌పోర్టులు. చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు
  • పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ 
నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో పలు మార్పులు చేశారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ NPS మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తు న్నట్లు చెప్పారు.

డిజిటల్ కరెన్సీ
ఈ ఏడాది బడ్జెట్‌లో అందరి దృష్టిని ఆకర్శించిన అంశం డిజిటల్ కరెన్సీ. బ్లాక్‌ చెయిన్ సాంకేతికతో RBI ఈ డిజిటల్ కరెన్సీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బ్యాకింగ్‌ రంగం అభివృద్ధిలో దూసుకుపోతుందని భావిస్తున్నారు.

నాలుగు మెయిన్ ఫార్ములాలతో..
నాలుగు మెయిన్ ఫార్ములాలతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు నిర్మల. మొదటిది – ప్రధాని గతిశక్తి యోజన. రెండోది సమీకృత అభివృద్ధి. మూడో ఫార్ములా అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు. ఇక నాలుగో ఫార్ములా…పరిశ్రమలకు ఆర్థిక ఊతం. ఈ 4 మెయిన్‌ ఫార్మూలాస్‌ ఆధారంగా బడ్జెట్‌ను తయారు చేశారు..అలాగే బడ్జెట్‌లో ప్రధానంగా 7 రంగాలపై ఫోకస్ చేశారు.. అవి.. గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత.

నదుల అనుసంధానం 
ఇక నదుల అనుసంధానం దిశగా కీలక ముందడుగు వేసింది కేంద్రం. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్.

 

V V ACADEMY

SI/CONSTABLE COACHING STARTES REGISTER YOUR NAMES 9985525552.

APPSC GROUP-IV COACHING

APPSC GROUP-IV COACHING CALSSES STARTED

Allocation to major schemes

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.