అంతర్జాతీయ యోగ దినోత్సవము

ప్రపంచ యోగ దినోత్సవం

‘అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.

2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడింది.2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు

2015

ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న నిర్వహించారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలోని, ప్రపంచంలోని నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

2016

రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని చండీగఢ్ ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచుమించు 30,000 హాజరయ్యారు.

2017

మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.50వేలమంది మధ్య యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఢిల్లీలోని కనౌట్‌ ప్రాంతంలో యోగా వేడుకల్లో పాల్గొన్నారు.

2018

4 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది శాంతి కోసం యోగా పేరుతో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా దాదాపు 5,000 యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. డెహ్రాడూన్‌లో కార్యక్రమంలో 55 వేల పాల్గొన్నారు.

2019

5 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, యోగా గురువులు, సహా దాదాపు 40,000 మంది హాజరయ్యారు.

2020

ఆరవ అంతర్జాతీయ యోగ దినోత్సవం కొవిడ్‌-19 వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎవరి ఇళ్లలో వారు నిర్వహించుకోవాలని ‘ఆయుష్‌’ మంత్రిత్వశాఖ సూచించింది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా యోగా వేడుకల్లో ఈసారి బృందాలుగా పాల్గొనే అవకాశం లేనందున, సాంకేతిక వేదికల(డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌) ద్వారా ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

2021.

ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 యొక్క థీమ్ “శ్రేయస్సు కోసం యోగా“. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజూ యోగా చేయమని ప్రోత్సహిస్తారు.

Loading

Comments

comments