VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – PRELIMS Paper-I: Arithmetic & Reasoning Held on 19 February 2023

100 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 100 (Page 4 of 10)
Q31.
A person travelled 12 km at a certain initial speed and then travelled 6 km at a speed 1/2 kmph faster than the initial speed. Had he travelled the entire distance at the increased speed, the time taken by him would have been 20 minutes less. Then the time (in hours) taken to travel the entire distance with initial speed is
ఒక వ్యక్తి కొంత ప్రారంభ వేగంతో 12 కి.మీ.లు ప్రయాణించిన తరువాత, ప్రారంభ వేగంకంటే గంటకు 1/2 కి.మీ. ఎక్కువ వేగంతో 6 కి.మీ. ప్రయాణించాడు. ఈ మొత్తం దూరాన్ని పెంచిన వేగంతోనే ప్రయాణించి ఉంటే, అతనికి 20 ని॥లు తక్కువ సమయం పట్టిఉండేది. అప్పుడు ప్రారంభ వేగంతోనే మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టేకాలం (గంటలలో)
Q32.
Same amount of money is given to A and B at the same time. After three years, A paid it back with a simple interest of 10% and B paid it back with an interest of 10% compounded annually. If the difference of amounts paid by them is Rs. 46.50, then the amount (in rupees) given to each of them initially is
ఒకే సమయంలో సమానమైన సొమ్ము A మరియు B లకు యివ్వబడింది. మూడు సంవత్సరాల తరువాత 10% బారువడ్డీతో అయ్యే మొత్తాన్ని A మరియు సాలీనా 10% చక్రవడ్డీతో అయ్యే మొత్తాన్ని B తిరిగి చెల్లించారు. వారు చెల్లించిన మొత్తం సొమ్ముల భేదం 46.50 రూ॥లయితే, వారికి ఒక్కొక్కరికి ప్రారంభంలో ఇచ్చిన సొమ్ము (రూపాయల్లో)
Q33.
A person X borrowed some money for simple interest at the rate of 6% per annum for the first three years, 9% per annum for the next five years and 13% per annum for the period beyond eight years. If the total interest paid by X at the end of eleventh year is Rs. 8,160, the money borrowed by X (in rupees) is
X అనే ఒక వ్యక్తి కొంత సొమ్మును సాధారణ వడ్డీకి, మొదటి మూడు సంవత్సరాలకు ఏటా 6% వడ్డీరేటుతోనూ, తరువాత అయిదు సంవత్సరాలకు ఏటా 9% వడ్డీరేటుతోనూ మరియు ఎనిమిది సంవత్సరాల తదుపరి కాలానికి ఏటా 13% వడ్డీరేటుతోనూ అప్పుగా తీసుకొన్నాడు. పదకొండవ సంవత్సరాంతంలో X చెల్లించిన మొత్తం వడ్డీ రూ. 8,160 లు అయితే, X అప్పుగా తీసుకొన్న సొమ్ము (రూపాయల్లో)
Q34.
If the simple interest on Rs. 1,750 for 3 years at 8% per annum is half of the compound interest on Rs. 4,000 for 2 years at x% per annum compounded annually, then x =
ఏడాదికి 8% బారువడ్డీతో మూడు సంవత్సరాలకు 1,750 రూ॥లపై అయ్యే వడ్డీ, ఏటా x% చక్రవడ్డీని గణించినప్పుడు రెండు సంవత్సరాలకు 4,000 రూ॥లపై అయ్యే వడ్డీలో సగం అయితే, అప్పుడు x =
Q35.
A sum of Rs. 1,600 is taken on compound interest at 20% per annum for two years. The difference amount (in Rs.) between the interests calculated on annually compounding basis and on half-yearly compounding basis is
20% సంవత్సరిక రేటుతో రూ. 1,600 ల సొమ్మును చక్రవడ్డీపై రెండు సంవత్సరాలకు తీసుకొన్నారు. వడ్డీని సంవత్సరానికొకసారి లెక్కించగావచ్చే వడ్డీకి, ప్రతి అర్థ సంవత్సరానికొకసారి లెక్కించగావచ్చే వడ్డీకి మధ్యగల వ్యత్యాసం సొమ్ము (రూపాయల్లో)
Q36.
A and B entered into a partnership with capitals in the ratio 4 : 5. After 3 months, A withdraws 1/4 of his capital and B withdraws 1/5 of his capital. After 7 months from then, they shared the profit among themselves. If A's share of profit is Rs. 330, then the total profit (in rupees) they have earned for ten months is
4 : 5 నిష్పత్తిలోగల మూలధనాలతో A మరియు B లు ఒక భాగస్వామ్యాన్ని ఆరంభించారు. మూడు నెలల తరువాత A అతని మూలధనం నుండి 1/4 వ వంతును, B అతని మూలధనం నుండి 1/5 వంతును వెనక్కితీసుకున్నారు. అప్పటి నుండి 7 నెలల తరువాత, వారు లాభాన్ని పంచుకున్నారు. A వాటా లాభం 330 రూ॥లు అయితే, 10 నెలల కాలానికి వారు సంపాదించిన మొత్తం లాభం (రూపాయల్లో)
Q37.
A and B are partners in a business. A invests Rs. 12,000 and B invests Rs. 20,000. Out of a total profit of Rs. 9,600, A receives 10% of the profit for managing the business and the rest of the profit is divided in the ratio of their capitals. Then A's share of amount (in rupees) in the total profit is
ఒక వ్యాపారంలో A మరియు B లు భాగస్వాములు. A పెట్టుబడి 12,000రూ॥లు మరియు B పెట్టుబడి 20,000 రూ॥లు. మొత్తం లాభం 9,600 రూ॥లలో, వ్యాపారాన్ని నడుపుతున్నందుకుగానూ లాభంలో 10 శాతాన్ని A పొందగా మిగిలిన దానిని వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకొన్నారు. అప్పుడు మొత్తం లాభంలో A పొందే వాటా (రూపాయల్లో)
Q38.
If a side and one of the diagonals of a rhombus are respectively 5 cm and 8 cm, then the area (in sq.cm) of the rhombus is
ఒక సమచతుర్భుజం యొక్క ఒక భుజము మరియు ఒక వికర్ణము వరుసగా 5 సెం.మీ. మరియు 8 సెం.మీ. అయితే, ఆ సమచతుర్భుజం యొక్క వైశాల్యం (చ॥సెం॥మీ. లలో)
Q39.
The shape of a park is a rectangle of length (4 + 20 + 4) = 28 units and breadth (4 + 15 + 4) = 23 units, with 4 quarter-circles of radius 4 units at the four corners and a central circle of radius √47 units. If the shaded portion represents the area covered with grass, then the area (in square units) uncovered with grass is
image
ఒక ఉద్యానవనం పొడవు (4 + 20 + 4) = 28 యూనిట్లు మరియు వెడల్పు (4 + 15 + 4) = 23 యూనిట్లు గల దీర్ఘచతురస్రాకారంలో ఉంది. నాలుగు మూలల్లో 4 యూనిట్ల వ్యాసార్థం గల నాలుగు పాదవృత్తాలు మరియు మధ్యలో √47 వ్యాసార్థం గల వృత్తం గడ్డితో కప్పబడి ఉంటే, గడ్డితో కప్పబడని భాగము యొక్క వైశాల్యం (చదరపు యూనిట్లలో) [π = 22/7]
image
Q40.
A window is in the shape of a square surmounted by an equilateral triangle such that their vertices coincide. If the perimeter of the window is 6 m, then the area of the window in square meters is
ఒక కిటికీ ఆకారం, చతురస్రముపై స్థిరముగా అదే భుజము పొడవుగల ఒక సమబాహు త్రిభుజమును ఆ రెండింటి శీర్షములు ఏకీభవించునట్లుగా ఉంచిన రూపంలో ఉంది. కిటికీ యొక్క పరిధి 6 మీ॥లయితే, చదరపు మీటర్లలో ఆ కిటికీ యొక్క వైశాల్యం