AP Grama Sachivalayam 2020
Government of Andhra Pradesh have released the new notification to fiillup the post for the AP GRAMA SACHIVALAYAM 2020 ,Andhra Pradesh Grama Sachivalayam has released the recruitment notification of Animal Husbandry Assistant, Village Horticulture Assistant, Panchayat Digital Assistant and Village Surveyor posts for 14061 vacancies. The interested and eligible candidates can apply through online on or before the last date. If the applications are arrived after the last date shall not be accepted.
vv academy grama sachivalayam selections click here
AP Grama Sachivalayam Recruitment Details
Name of the Board | Andhra Pradesh Grama Sachivalayam |
---|---|
Post Name | Animal Husbandry Assistant, Village Horticulture Assistant, Panchayat Digital Assistant and Village Surveyor |
Vacancy | 14061 |
Start Date & Last Date | 11.01.2020 to 31.01.2020 |
For Official Notification | Click Here |
AP Grama Sachivalayam Notification 2020 Vacancies
- Panchayat Secretary (Gr-V) – 61
- Village Revenue Officer (Gr-II) – 246
- ANMs/ Multi Purpose Health Assistant – 648
- Village Fisheries Assistant – 69
- Village Horticulture Assistant – 1782
- Village Agriculture Assistant (Gr-II) – 536
- Village Sericulture Assistant – 43
- Grama Mahila Samrakshana Karyadarshi – 762
- Engineering Assistant – (Gr II) – 570
- Panchayat Secreatary (Gr-VI) Digital Assistant – 1134
- Village Surveyor (Gr III) – 1255
- Welfare and education Assistant – 97
- Animal Husbandry Assistant – 6858
✍🏻గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు-2020 సమగ్ర సమాచార౦✍🏻
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రెండో విడతలో 16 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. వీటి ద్వారా గ్రామ సచివాలయాల్లో 13 రకాల ఉద్యోగాలు, వార్డు సచివాలయాల్లో 6 రకాల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి/ఏప్రిల్ నెలల్లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. విభాగాలు, జిల్లాల వారీ ఖాళీలు, అర్హతలు, పరీక్ష విధానం తదితర అంశాలపై సమగ్ర సమాచారం…
*గ్రామ సచివాలయ ఉద్యోగాలు : 1. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 :
మొత్తం పోస్టులు: 61
జిల్లాల వారీ పోస్టులు: శ్రీకాకుళం-8, విజయనగరం-4, విశాఖపట్నం-28, పశ్చిమ గోదావరి-3, కృష్ణా-15, గుంటూరు-1, ప్రకాశం-1, నెల్లూరు-1.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: రాతపరీక్షలో పార్ట్-ఏ, పార్ట్-బీ విభాగాలు మొత్తం 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏ 75 నిమిషాల కాల వ్యవధితో 75 మార్కులకు- 75 ప్రశ్నలుంటాయి. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్-బీ కూడా 75 నిమిషాల కాల వ్యవధితో 75 మార్కులకు 75 ప్రశ్నలుంటాయి. ఇందులో హిస్టరీ, ఎకానమీ, జాగ్రపీ, పాలిటీ తదితర సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది.
*2. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(గ్రేడ్-2) :
మొత్తం పోస్టులు:246
జిల్లాల వారీ పోస్టులు: శ్రీకాకుళం-19, విజయనగరం-74, విశాఖపట్నం-50, కృష్ణా-34, గుంటూరు-3, ప్రకాశం-2, నెల్లూరు-12, చిత్తూరు-26, అనంతపురం-13, వైఎస్సార్ కడప-4, కర్నూలు-9.
అర్హత: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత లేదా ఐటీఐ(సివిల్-డ్రాఫ్ట్స్‌మెన్) ఉత్తీర్ణత ఉండాలి.
పరీక్ష విధానం: రాతపరీక్షలో పార్ట్-ఏ, పార్ట్-బీలు 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో 50 మార్కులకు- 50 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్-బీ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో సర్వే అండ్ డ్రాయింగ్ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
3. ఏఎన్‌ఎం/మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు)-గ్రేడ్ 3 :
మొత్తం పోస్టులు: 648
జిల్లాల వారీ పోస్టులు: శ్రీకాకుళం-36, విజయనగరం-46, విశాఖపట్నం-81, తూర్పుగోదావరి-58, పశ్చిమగోదావరి-50, కృష్ణా-112, గుంటూరు-34, ప్రకాశం-16, నెల్లూరు-57, చిత్తూరు-80, అనంతపురం-12, కర్నూలు-31, వైఎస్సార్ కడప-35.
అర్హత: ఎస్‌ఎస్‌సీ లేదా ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు ఎమ్‌పీహెచ్‌ఏ కోర్సు లేదా రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తి చేసుండాలి. అనంతరం ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసుండాలి.
పరీక్ష విధానం: పార్ట్-ఏ,పార్ట్-బీలు మొత్తం 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 50నిమిషాలు. పార్ట్-బీలో సెన్సైస్, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ విభాగాల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
4. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ :
మొత్తం పోస్టులు: 6858
జిల్లాల వారీ ఖాళీలు: అనంతపురం-610, చిత్తూరు-692, కర్నూలు-669, కడప-470, నెల్లూరు-469, ప్రకాశం-522, గుంటూరు-624, కృష్ణా-619, పశ్చిమ గోదావరి-350, తూర్పు గోదావరి-531, విశాఖపట్నం-406, విజయనగరం-372, శ్రీకాకుళం-524.
అర్హత: ఎస్వీ యూనివర్సిటీ అందిస్తున్న రెండేళ్ల యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణత లేదా డెయిరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు/రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: రాతపరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఏ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీ 100 మార్కులకు ఉంటుంది. యానిమల్ హస్బెండరీ సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ :
మొత్తం పోస్టులు:69
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-7, విజయనగరం-4, విశాఖపట్నం-9, తూర్పు గోదావరి-8, పశ్చిమగోదావరి-9, కృష్ణా-5, గుంటూరు-4, ప్రకాశం-5, నెల్లూరు-5, చిత్తూరు-2, అనంతపురం-3, వైఎస్సార్ కడప-2, కర్నూలు-6.
అర్హత: ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫిషరీస్/ఆక్వాకల్చర్ లేదా నాలుగేళ్ల బీఎఫ్‌ఎస్సీ డిగ్రీ లేదా బీఎస్సీ (ఫిషరీస్/ఆక్వాకల్చర్) లేదా ఎంఎస్సీ (ఫిషరీస్ సైన్స్/ఫిషరీ బయోలజీ/ఆక్వాకల్చర్ /క్యాప్చర్ అండ్ కల్చర్ ఫిషరీస్/మెరైన్ బయాలజీ/కోస్టల్ ఆక్వాకల్చర్/ఓషనోగ్రఫీ/ ఇండస్ట్రియల్ ఫిషరీస్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: పార్ట్-ఏ, బీ కలిపి 150 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 50 నిమిషాలు. పార్ట్-బీ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో బయాలజీ ఆఫ్ ఫిష్ అండ్ ఫ్రాన్, ఆక్వాకల్చర్, సీడ్ ప్రొడక్షన్, పాండ్ మేనేజ్‌మెంట్, ఫిష్ అండ్ ఫ్రాన్ ఫీడ్ మేనేజ్‌మెంట్, మెరైన్ ఫిషరీస్, గేర్ అండ్ క్రాఫ్ట్, హెల్త్ మేనేజ్‌మెంట్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఫిషరీ ఎకనామిక్స్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
6. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ :
మొత్తం పోస్టులు: 1783
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-56, విజయనగరం-58, విశాఖపట్నం-247, తూర్పుగోదావరి-161, పశ్చిమగోదావరి-93, కృష్ణా-129, గుంటూరు-74, ప్రకాశం-40, నెల్లూరు-102, చిత్తూరు-389, అనంతపురం-183, కర్నూలు-92, వైఎస్సార్ కడప-159.
అర్హత: బీఎస్సీ హార్టికల్చర్/బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్/బీటెక్ హార్టికల్చర్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరిగే రాతపరీక్షలో పార్ట్-ఏ, బీ రెండు విభాగాలుంటాయి. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలిస్తారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో హార్టికల్చర్ సబ్జెక్ట్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (గ్రేడ్-3)
మొత్తం పోస్టులు:536
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-63, విజయనగరం-69, విశాఖపట్నం-16, తూర్పు గోదావరి-118, పశ్చిమ గోదావరి-24, కృష్ణా-15, గుంటూరు-14, ప్రకాశం-15, నెల్లూరు-150, చిత్తూరు-36, అనంతపురం-1, కర్నూలు-9, వైఎస్సార్ కడప-6.
అర్హతలు: బీఎస్సీ-అగ్రికల్చర్ లేదా బీఎస్సీ-కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా బీటెక్-అగ్రికల్చర్ ఇంజినీరింగ్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ (సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో హార్టికల్చర్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
8. విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ :
మొత్తం పోస్టులు:43
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-3, విజయనగరం-2, విశాఖపట్నం-1, తూర్పు గోదావరి-2, పశ్చిమగోదావరి-5, కృష్ణా-4, ప్రకాశం-4, చిత్తూరు-13, అనంతపురం-5, కర్నూలు-3, వైఎస్సార్ కడప-1.
అర్హత: ఇంటర్ వొకేషనల్ కోర్స్ ఇన్ సెరీకల్చర్/బీఎస్సీ-సెరీకల్చర్/బీఎస్సీ విత్ పీజీ డిప్లొమా ఇన్ సెరీకల్చర్/ఎంఎస్సీ-సెరీకల్చర్/ఎంఎస్సీ-సెరీ బయోటెక్నాలజీ/ ఎంఎస్సీ-అప్లయిడ్ సెన్సైస్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సెరీకల్చర్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
9. గ్రామ మహిళా సంస్కరణ కార్యదర్శి/వార్డు మహిళా సంస్కరణ కార్యదర్శి :
మొత్తం పోస్టులు:762
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-45, విజయనగరం-72, విశాఖపట్నం-90, తూర్పుగోదావరి-99, పశ్చిమగోదావరి-18, కృష్ణా-72, గుంటూరు-51, ప్రకాశం-124, నెల్లూరు-23, చిత్తూరు-82, అనంతపురం-46, కర్నూలు-23, వైఎస్సార్ కడప-17.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: రాతపరీక్షలో రెండు విభాగాలు కలిపి 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులకు వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. పార్ట్-బీలో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర విభాగాల నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులకు ఇస్తారు. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
10. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-3) :
మొత్తం పోస్టులు:570
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-60, విజయనగరం-81, విశాఖపట్నం-24, తూర్పుగోదావరి-50, పశ్చిమగోదావరి-66, కృష్ణా-35, గుంటూరు-30, ప్రకాశం-74, నెల్లూరు-35, చిత్తూరు-50, అనంతపురం-19, కర్నూలు-34, వైఎస్సార్ కడప-12.
అర్హత: సివిల్, మెకానికల్ విభాగాల్లో డిప్లొమా లేదా సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో డిప్లొమా స్థాయిలో సివిల్/మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
11. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (డిజిటల్ అసిస్టెంట్) :
మొత్తం పోస్టులు:1134
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-124, విజయనగరం-149, విశాఖపట్నం-33, తూర్పు గోదావరి-129, పశ్చిమగోదావరి-117, కృష్ణా-31, గుంటూరు-16, ప్రకాశం-115, నెల్లూరు-46, చిత్తూరు-123, అనంతపురం-119, కర్నూలు-111, వైఎస్సార్ కడప-21.
అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. లేదా బీసీఏ/ఎంసీఏ,బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం(కంప్యూటర్స్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రపీ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
12. విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 :
మొత్తం పోస్టులు: 1255
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-159, విజయనగరం-151, విశాఖపట్నం-111, తూర్పుగోదావరి-36, పశ్చిమగోదావరి-155, కృష్ణా-70, గుంటూరు-16, ప్రకాశం-144, నెల్లూరు-109, చిత్తూరు-131, అనంతపురం-19, కర్నూలు-140, వైఎస్సార్ కడప-14.
అర్హత: ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్) లేదా సర్వేయింగ్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత లేదా డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్) లేదా బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
13. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ :
మొత్తం పోస్టులు:97
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-27, విజయనగరం-14, విశాఖపట్నం-8, తూర్పు గోదావరి-14, పశ్చిమగోదావరి-7, కృష్ణా-3, గుంటూరు-3, ప్రకాశం-7, చిత్తూరు-4, అనంతపురం-1, కర్నూలు-8, వైఎస్సార్ కడప-1.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇన్‌క్లూడింగ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, కాంప్రెహెన్షన్-తెలుగు అండ్ ఇంగ్లిష్, జనరల్ ఇంగ్లిష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ తదితర అంశాల నుంచి 75 మార్కులకు 75 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. పార్ట్-బీలో ఇండియా, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ అండ్ ప్లానింగ్, సొసైటీ, సొషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూస్, ఫిజికల్ జాగ్రపీ, ఏపీ రాష్ట్ర విభజన, రాష్ట్ర ప్రభుత్వ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్, ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై 75 మార్కులకు 75 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు.
*వార్డు సచివాలయ కొలువులు :
1. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ :
మొత్తం పోస్టులు:105
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-2, విజయనగరం-2, విశాఖపట్నం-42, తూర్పు గోదావరి-16, పశ్చిమగోదావరి-12, కృష్ణా-17, గుంటూరు-1, ప్రకాశం-1, నెల్లూరు-2, చిత్తూరు-6, కర్నూలు-3, వైఎస్సార్ కడప-1.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 మార్కులకు 75 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 75 నిమిషాలు. పార్ట్-బీలో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర విభాగాల నుంచి 75 మార్కులకు 75 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 75 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
2. వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2) :
మొత్తం పోస్టులు:371
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-9, విజయనగరం-10, విశాఖపట్నం-11, తూర్పు గోదావరి-30, పశ్చిమ గోదావరి-45, కృష్ణా-13, గుంటూరు-16, ప్రకాశం-21, నెల్లూరు-50, చిత్తూరు-30, అనంతపురం-72, కర్నూలు-53, వైఎస్సార్ కడప-11.
అర్హత: సివిల్/మెకానికల్ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
3. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ:
మొత్తం పోస్టులు:513
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-6, విజయనగరం-5, విశాఖపట్నం-129, తూర్పు గోదావరి-24, పశ్చిమగోదావరి-18, కృష్ణా-111, గుంటూరు-44, ప్రకాశం-10, నెల్లూరు-25, చిత్తూరు-75, అనంతపురం-31, కర్నూలు-9, వైఎస్సార్ కడప-26.
అర్హత: సైన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ లేదా శానిటేషన్ సైన్స్, మైక్రో-బయాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బోటనీ, జువాలజీ, బయో-సెన్సైస్ విభాగాల్లో బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్)/ఎంఎస్సీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
4. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ :
మొత్తం పోస్టులు: 100
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-2, విజయనగరం-2, విశాఖపట్నం-7, తూర్పు గోదావరి-10, పశ్చిమగోదావరి-24, కృష్ణా-8, గుంటూరు-9, ప్రకాశం-6, నెల్లూరు-7, చిత్తూరు-10, అనంతపురం-5, కర్నూలు-6, వైఎస్సార్ కడప-4.
అర్హత: బీటెక్ కంప్యూటర్ సైన్స్/ఐటీ లేదా బీఈ/బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
5. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2) :
మొత్తం పోస్టులు: 844
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-15, విజయనగరం-14, విశాఖపట్నం-115, తూర్పు గోదావరి-82, పశ్చిమగోదావరి-48, కృష్ణా-102, గుంటూరు-105, ప్రకాశం-38, నెల్లూరు-74, చిత్తూరు-86, అనంతపురం-57, కర్నూలు-62, వైఎస్సార్ కడప-46.
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్/ఎల్‌ఏఏ లేదా బీఆర్క్/బీ ప్లానింగ్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
6. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2) :
మొత్తం పోస్టులు: 213
జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-6, విజయనగరం-5, విశాఖపట్నం-44, తూర్పు గోదావరి-20, పశ్చిమగోదావరి-8, కృష్ణా-30, గుంటూరు-15, ప్రకాశం-5, నెల్లూరు-18, చిత్తూరు-38, అనంతపురం-3, కర్నూలు-8, వైఎస్సార్ కడప-13.
అర్హత: సంబంధిత విభాగంలో యూజీ లేదా పీజీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ముఖ్య సమాచారం :
మొత్తం ఉద్యోగాలు: 16,207
గ్రామ సచివాలయ ఉద్యోగాలు: 14,061
వార్డు సచివాలయ ఉద్యోగాలు: 2,146
వయసు: జులై 1, 2020 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.400(అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు-రూ.200; ఎగ్జామినేషన్ ఫీజు-రూ.200); ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.200 మాత్రమే చెల్లించాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జనవరి 30, 2020
దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 31, 2020
ఎంపిక: రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్: http://wardsachivalayam.ap.gov.in (or) http://gramasachivalayam.ap.gov.in