15,971 సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్

15,971 సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్

15,971 సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్

మిగిలిన సచివాలయపోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ !

ప్రస్తుత ఖాళీలు 15,971 పోస్టులు

  • మరో 3 వేలకు పైగా పోస్టులు పెరిగే అవకాశం
  • పాత పద్ధతి, మార్గదర్శకాలే వర్తింపు ఆ పంచాయతీరాజ్ శాఖ ద్వారా భర్తీ ప్రక్రియ

గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది. వీటిలో అత్యధికంగా

6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు 

 1,746  గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు

1,284 విలేజీ సర్వేయర్ పోస్టులు 

1,122 పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 

ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులుభర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

3 వేలకు పైగా పోస్టులు అదనం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు

అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏ ర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు

భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపి నా.. వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

 

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Comments

comments