You are currently viewing హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు

హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఇక సీఎం కేజ్రీవాల్ పోటిచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.

  • ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తొలి ఫలితం వెల్లడయ్యింది. శీలంపూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్‌ వన్‌ సైడ్‌గా నిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం కేజ్రీవాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ఢిల్లీ ప్రజలు విజయం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్దికే ప్రజలు ఓటేశారు. ఈ విజయం కొత్త రాజకీయాలకు నాంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది’అంటూ ఆ ప్రకటనలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

 

హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు

ఒకసారి గెలవడం అంటే అవకాశం.. రెండవసారి నిలవడం అంటే నమ్మకం.. మూడవసారి పట్టం కట్టారంటే అంతకుమించి అనే కదా? అవును మూడు సార్లు గెలవడం.. అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. అందులోనూ ఢిల్లీ లాంటి చోట.. దేశ రాజధానిలో చదువుకున్న వాళ్లు ఎక్కువగా ఉండే చోట కూడా ఇటువంటి నిర్ణయం వచ్చింది అంటే అది కేజ్రివాల్ మేజిక్ అని చెప్పాల్సిందే ఇప్పటివరకు దేశంలో మూడు సార్లు వరుసగా సీఎం అయినవాళ్లు కేజ్రీవాల్‌తో సహా అనేకమంది ఉన్నారు.

జ్యోతి బసు, పవన్ కుమార్ చామ్లింగ్, మోహన్ లాల్ సుకాడియా, గోవింద్ బల్లబ్ పంత్, మానిక్ సర్కార్ శివరాజ్ సికంగ్ చౌహాన్, రమణ్ సింగ్, ఒక్రమ్ ఇబోబి సింగ్, నరేంద్ర మోడీ, తరుణఫ్ గోగోయ్, షీలా దీక్షత్, వసంతరావ్ నాయక్, కే కామ్‌రాజ్, బిమల ప్రసాద్ ఛలిహా, నవీన్ పట్నాయక్, కేజ్రివాల్.

జ్యోతి బసు:
దేశంలోనే అత్య‌ధిక కాలం సీఎంగా ప‌నిచేసిన క‌మ్యూనిస్టు నేత జ్యోతిబ‌సు.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదుసార్లు ప‌నిచేశారు. బెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని  లెఫ్ట్ ఫ్రంట్ నుంచి 1977 నుంచి 2000 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

పవన్‌కుమార్‌ చామ్లింగ్:
అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదుసార్లు పనిచేసిన ఘనత చామ్లింగ్‌దే. తాను స్థాపించిన సిక్కిం డెమోక్ర‌టిక్ ఫ్రంట్ త‌ర‌ఫున‌ 1994 నుంచి 2019 వరకు సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ఎన్నిక‌య్యారు పవన్ కుమార్ చామ్లింగ్.

న‌వీన్ ప‌ట్నాయ‌క్:
ఒడిశా ముఖ్యమంత్రిగా న‌వీన్ ప‌ట్నాయ‌క్ వ‌రుస విజ‌యాల‌తో ఉన్నారు. త‌న తండ్రి, ఒడిశా మాజీ సీఎం బిజూ ప‌ట్నాయ‌క్ వార‌స‌త్వాన్ని అందుపుచ్చుకొని జ‌న‌తాద‌ళ్ నుంచి బ‌య‌ట‌కువ‌చ్చి త‌న‌తండ్రి పేరుతో బిజూ జ‌న‌తాద‌ళ్‌ను స్థాపించారు. వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగి గెలిచారు.

మాణిక్‌ సర్కార్:
తర్వాత మాణిక్ సర్కార్.. త్రిపుర ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ప‌నిచేశారు. సీపీఎం నుంచి 1998 నుంచి 2018 వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు.

శివరాజ్‌సింగ్‌ చౌహాన్:
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు వ‌రుస‌గా మూడు సార్లు గెలిచారు శివరాజ్ సింగ్ చౌహాన్.  2005 నుంచి 2018 వ‌ర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు ఆయన.

రమణ సింగ్: 
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారు రమణ్ సింగ్. 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు పనిచేశారు రమణ్ సింగ్.  ఛత్తీస్‌గఢ్‌కు రెండో ముఖ్యమంత్రిగా అయిన ఆయన బీజేపీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు.

నరేంద్ర మోడీ:
వరుసగా దేశానికి రెండు సార్లు ప్రధాని అయిన నరేంద్ర మోడీ, అంతకుముందు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మూడు సార్లు ప‌నిచేశారు. 2002, 2007, 2012 ఎన్నిక‌ల్లో గెలిచిన మోడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాతి కాలంలో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్ధిగా మారి రెండు సార్లు ప్రధాని అయ్యారు.

తరుణ్ గొగొయి:
కాంగ్రెస్ పార్టీ నుంచి అసోంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు తరుణ్ గోగోయ్.. 2001 నుంచి 2016 వరకు పూర్తిస్థాయి సీఎంగా పనిచేశారు. ముఖ్య‌మంత్రి కాక‌ముందు ఆయ‌న కాంగ్రెస్ నుంచి ఆరు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వ‌హించారు.

షీలా దీక్షత్:
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కంటే ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు షీలా దీక్షత్. 1998 నుంచి 2013 వరకు మూడు సార్లు పూర్తి కాలంపాటు సీఎంగా పనిచేశారు ఆమె. 2013 ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ చేతిలో ఆమె ఓడిపోయారు.

అరవింద్ కేజ్రీవాల్: 
అన్నా హజారేతో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్న కేజ్రీవాల్‌ ఢిల్లీ పీఠాన్ని వరుసగా మూడోసారి దక్కించుకున్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్‌ 2013 డిసెంబర్‌ 28న తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు మూడోసారి ఇప్పటికి అందిన ట్రెండ్స్ ప్రకారం 60కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా.. మూడవసారి ముఖ్మమంత్రి అయి హ్యాట్రిక్ కొడుతున్నారు.

మోహన్ లాల్ సుకాడియా రాజస్థాన్ నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున, గోవింద్ బల్లబ్ పంత్ కాంగ్రెస్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ కి నాలుగు సార్లు, ఒక్రమ్ సింగ్ మణిపూర్ నుంచి కాంగ్రెస్ తరపున మూడు సార్లు, కామ్ రాజ్ తమిళ్ నాడు తరపున కాంగ్రెస్ నుంచి మూడు సార్లు, బిమలా ప్రసాద్ అస్సాం నుంచి కాంగ్రెస్ తరపున మూడు సార్లు ముఖ్యమంత్రులుగా గెలిచారు.

Loading

Comments

comments