VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–90 of 200 (Page 9 of 20)
Q81.
If the length of a rectangle is decreased by 10 ft. and breadth is increased by 5 ft., then that rectangle becomes a square and the area of the rectangle is reduced by 210 sq.ft. The area (in sq.ft.) of that rectangle is
ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవులో 10 అడుగులు తగ్గించి, వెడల్పును 5 అడుగులు పెంచితే అప్పుడు ఆ దీర్ఘచతురస్రం ఒక చతురస్రంగా మారుతుంది మరియు ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం 210 చ. అ. తగ్గుతుంది. ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం (చ. అ.లలో)
Q82.
If the price per foot for constructing a fence is Rs. 72, then the cost (in Rs.) of constructing a fence around a square plot with an area 361 sq.ft. is
ఒక కంచెను నిర్మించడానికి అడుగునకు రూ.72 ఖర్చు అయితే, 361 చదరపు అడుగుల వైశాల్యంగల చతురస్రాకారపు స్థలం చుట్టూ కంచెను నిర్మించడానికి అయ్యే ఖర్చు (రూ.లలో)
Q83.
A person wanted to construct a horizontal water tank with iron sheet in the shape of a cylinder exactly surmounted by a hemisphere at both the ends such that they exactly match with the periphery of the end faces. The maximum horizontal length of the tank is 14 feet and the diameter of the cylinder is 5 feet. The cost (in Rs.) of the iron sheet required to construct the tank at the rate of Rs. 28 per sq. unit, is
ఒక క్షితిజ సమాంతర స్థూపమునకు రెండు చివరల గల తలముల అంచులకు సరిసమానమైన అర్ధగోళములను అతికించబడినట్లు, ఒక వ్యక్తి ఇనుప రేకుతో ఒక నీటి తొట్టెను నిర్మించాలనుకొన్నాడు. ఆ తొట్టె యొక్క గరిష్ఠ క్షితిజ సమాంతర పొడవు 14 అడుగులు మరియు స్థూపం వ్యాసం 5 అడుగులు. ఇనుప రేకు ఖరీదు చదరపు యూనిట్‌కు రూ. 28 చొప్పున, ఆ తొట్టెను నిర్మించడానికి అవసరమైన ఇనుప రేకు ధర (రూ.లలో)
Q84.
A hollow iron pipe is 21 cms long and its external diameter is 8 cm. If the thickness of the pipe is 1 cm and iron weighs 8 grams/cubic centimeter, then the weight (in kilograms) of the pipe is
డొల్లగానున్న ఒక ఇనుప పైపు పొడవు 21 సెం.మీ. మరియు దాని బాహ్య వ్యాసము 8 సెం.మీ. ఆ పైపు యొక్క మందం 1 సెం.మీ. మరియు ఇనుము ఘ. సెం.మీ.కు 8 గ్రాముల బరువు కలిగి ఉంటే, ఆ పైపు యొక్క బరువు (కిలోగ్రాములలో)
Q85.
A solid right circular cone is inscribed in a cube. The base diameter of the cone, the height of the cone and the edge of the cube are equal in length. If the edge of the cube is 7 cm, then the amount of water (in cu.cm) that can be stored in the remaining vacant space in the cube is
ఒక ఘనములో ఒక గట్టి (solid) లంబ వృత్తీయ శంఖువును అంతర్లిఖితంగా ఉంచారు. శంఖువు భూవ్యాసము, శంఖువు ఎత్తు మరియు ఘనము అంచుల పొడవులు సమానం. ఘనము యొక్క అంచు 7 సెం.మీ. అయితే ఆ ఘనములో మిగిలి ఉన్న ఖాళీ అంతరాళంలో నిలువచేయగలిగిన నీటి పరిమాణము (ఘన సెం.మీ.లలో)
Q86.
A cylinder is formed by joining the edges along the breadth of a rectangular sheet of length 54 cm and breadth 44 cm. Then the ratio between the numerical values of the lateral surface area and the volume of the cylinder thus formed is
54 సెం.మీ. పొడవు మరియు 44 సెం.మీ. వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకారపు షీట్ను వెడల్పు వెంబడి దాని అంచులను కలుపుతూ ఒక స్థూపముగా ఏర్పడేటట్లు చుట్టినారు. ఈ విధంగా ఏర్పడిన స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యము మరియు ఘనపరిమాణముల సంఖ్యాత్మక విలువల మధ్యగల నిష్పత్తి
Q87.
If 26th January of a non-leap year falls on a Sunday, then the day on which 15th August of that year falls is
లీపు సంవత్సరంకాని ఒక సంవత్సరంలో జనవరి 26వ తేదీ ఆదివారమైతే, అప్పుడు ఆ సంవత్సరంలో ఆగష్టు 15వ తేదీన వచ్చే రోజు
Q88.
A vendor sells ice cream by filling it in a conical shaped vessel with its crest taking the shape of a hemisphere surmounted on the cone. If the radius of the hemisphere is 2 cm and the entire volume of the Ice cream is 88 cu cm then the height of that cone is
ఒక వ్యాపారి, ఒక శంఖువు ఆకారపు పాత్రలో ఐస్క్రీమ్ను నింపి దాని వృత్తాకార పరిధిపై కచ్ఛితంగా సరిపడేటట్లుగా బోర్లించిన అర్ధగోళం రూపంలో ఐస్క్రీమ్ను ఉంచి అమ్ముతాడు. అర్ధగోళం యొక్క వ్యాసార్ధము 2 సెం.మీ. మరియు ఐస్క్రీమ్ యొక్క మొత్తం ఘనపరిమాణం 88 ఘ. సెం.మీ. అయితే శంఖువు యొక్క ఎత్తు
Q89.
The height of a cuboid shaped container is 2.5 times its breadth and its volume is equal to the sum of the volumes of 8 identical cubic shaped boxes, the length of whose edge is one-fourth of the length of the cuboid. Then the ratio of the length, breadth and height of that cuboid is
దీర్ఘ ఘనాకారంగానున్న ఒక కంటైనర్ యొక్క ఎత్తు, దాని వెడల్పునకు 2.5 రెట్లు వుంది మరియు దాని ఘనపరిమాణం, దీర్ఘఘనం పొడవులో 4వ వంతు పొడవును అంచుగా కలిగిన 8 సర్వ సమాన ఘనాకార పెట్టెల ఘనపరిమాణాల మొత్తానికి సమానము. అప్పుడు ఆ దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి
Q90.
The radii of a cone, a hemisphere and a cylinder are equal. If their total surface areas are also equal, then the ratio of the heights of the cylinder and the cone is
ఒక శంఖువు, అర్ధగోళము మరియు స్థూపముల వ్యాసార్థాలు సమానం. వాటి సంపూర్ణ తల వైశాల్యాలు కూడా సమానమైతే, అప్పుడు ఆ స్థూపము మరియు శంఖువుల ఎత్తుల నిష్పత్తి