VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–80 of 200 (Page 8 of 20)
Q71.
A and B started a business by investing Rs. 48,000 and Rs. 36,000 respectively. After 6 months, C joined them as a managing partner by investing Rs. 72,000 and a monthly salary of Rs. 500 was paid to him from the annual profit for managing the business. If C's salary came out to be 10% of the annual profit, then the share of A (in Rs.) in the annual profit is
A మరియు B లు ఒక వ్యాపారాన్ని వరుసగా రూ.48,000 ల మరియు రూ.36,000 పెట్టుబడితో ప్రారంభించినారు. 6 నెలల తరువాత రూ. 72,000 పెట్టుబడితో C నిర్వహణ భాగస్వామిగా చేరగా వార్షిక లాభాల నుండి వ్యాపారం నిర్వహించినందుకు అతనికి నెలకు రూ. 500 జీతం చెల్లించారు. C పొందిన జీతం వార్షిక లాభంలో 10% అయితే, సంవత్సరాంత లాభంలో A వాటా (రూ.లలో)
Q72.
Two persons A and B hired a field on rent for Rs. 1,800. A puts 9 horses for 7 months and 10 cows for 3 months; while B puts 18 cows for 5 months and 30 sheep for 10 months to graze in that field. If in a day 3 horses can eat as much as 5 cows and in a day 6 cows can eat as much as 10 sheep, then A's share of the rent (in rupees) is
A మరియు B అను ఇద్దరు వ్యక్తులు ఒక పొలాన్ని రూ. 1,800 కు అద్దెకు తీసుకొన్నారు. ఆ పొలంలో మేత మేయడానికి 9 గుర్రాలను 7 నెలలపాటు మరియు 10 ఆవులను 3 నెలలపాటు A ఉంచగా, 18 ఆవులను 5 నెలలపాటు, 30 గొర్రెలను 10 నెలలపాటు B ఆ పొలంలో ఉంచినాడు. ఒక రోజులో 3 గుర్రాలు తినే మేత 5 ఆవులు తినగలిగే మేత పరిమాణానికి సమానం, అదేవిధంగా ఒక రోజులో 6 ఆవులు తినే మేత 10 గొర్రెలు తినగలిగే మేత పరిమాణానికి సమానం అయితే, A చెల్లించవలసిన అద్దెలో భాగం (రూపాయల్లో)
Q73.
A and B entered into a partnership by investing Rs. 32,000 and Rs. 24,000 respectively. After 3 months, A withdrew Rs. 10,000, while B invested Rs. 10,000 more. From then after 3 more months C joined the business with a capital of Rs. 42,000. If the total annual profit is Rs. 26,400, then in that profit the share of B exceeds that of C by Rs.
A మరియు B లు కలసి వరుసగా రూ.32,000 మరియు రూ.24,000 పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించినారు. 3 నెలల తరువాత, రూ.10,000 లను A వెనకకు తీసికొనగా, B అదనంగా రూ. 10,000 లను పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత మరో 3 నెలల అనంతరం C అనువ్యక్తి రూ.42,000 పెట్టుబడితో ఆ వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. సంవత్సరాంతంలో మొత్తం లాభం రూ. 26,400 అయితే, ఆ లాభంలో C వాటా కంటే B వాటాకు అదనంగా వచ్చే సొమ్ము (రూపాయల్లో)
Q74.
Teja, Deepu and Kanth invested Rs. 0.8, 1.2 and 1.6 lakhs respectively in a business. Teja gets 10% of the profit to maintain the business and the remaining profit is shared among the three in the ratio of their investments. If the total profit earned is Rs. 1,20,000 in one year, then Teja's total share in the profit (in Rs.) is
ఒక వ్యాపారంలో తేజ, దీపు మరియు కాంత్లు వరుసగా రూ.0.8, 1.2, 1.6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వ్యాపారం నడుపుతున్నందుకుగాను లాభంలో 10% తేజాకు ఇచ్చి మిగిలిన లాభాన్ని ముగ్గురూ వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. ఒక సంవత్సరానికి వచ్చిన మొత్తం లాభం రూ.1,20,000 అయితే, లాభంలో తేజా మొత్తం వాటా సొమ్ము (రూ.లలో)
Q75.
In the given figure ABCD is a square. EFGH is the square formed by joining the midpoints of the sides of ABCD. LMNO is the square formed by joining the midpoints of the sides of EFGH. If a circle inscribed in the square LMNO is having the area 154 sq.cms. Then the area of square ABCD (in sq.cms) is
క్రింది చిత్రంలో ABCD ఒక చతురస్రం. ABCD యొక్క భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడిన చతురస్రం EFGH. EFGH యొక్క భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడిన చతురస్రం LMNO. LMNO నందు అంతర్లిఖించబడిన వృత్తవైశాల్యం 154 చ.సెం.మీ. అయితే, చతురస్రం ABCD వైశాల్యం (చ.సెం.మీ.లలో)
image
Q76.
If the perimeters of a circle, a square and an equilateral triangle are equal, which one of the following is true?
ఒక వృత్తము, ఒక చతురస్రము మరియు ఒక సమబాహు త్రిభుజముల చుట్టుకొలతలు సమానంగా ఉంటే, ఈ క్రింది వానిలో ఏది సత్యము?
Q77.
A wire would enclose an area of 1936 m2, if it is bent into a square. The wire is cut into two pieces such that the longer piece is 3 times the smaller one in length. If the shorter piece is bent into a circle, then the area of the circle (in square meters) is
ఒక తీగను చతురస్రాకారంగా వంచినప్పుడు అది 1936 చ.మీ. వైశాల్యాన్ని ఆవరిస్తుంది. పెద్దముక్క పొడవు చిన్నముక్క పొడవుకు మూడు రెట్లు అయ్యేటట్లుగా ఆ తీగను రెండు ముక్కలుగా చేసారు. చిన్న ముక్కను వృత్తముగా వంచితే, అప్పుడు ఆ వృత్తము యొక్క వైశాల్యం (చదరపు మీటర్లలో)
Q78.
If p1, p2, p3, p4 represent the perimeters of the rectangles A, B, C, D respectively as shown in the figure given below (2×2 grid with A top-left, B top-right, C bottom-left, D bottom-right), then p4 in terms of p1, p2 and p3 is equal to
క్రింది పటంలో చూపిన దీర్ఘచతురస్రాలు A, B, C, D ల చుట్టు కొలతలను వరుసగా p1, p2, p3, p4 లతో సూచిస్తే, p1, p2, p3 పదాలలో p4 కి సమానం అయ్యేది
image
Q79.
If ABCD is a square, M is the mid point of CD and the area of triangle AMD is 4 sq.units, then the area (in sq. units) of triangle AMB is
ABCD ఒక చతురస్రం, CD మధ్యబిందువు M మరియు త్రిభుజం AMD యొక్క వైశాల్యం 4 చదరపు యూనిట్లైతే, త్రిభుజం AMB యొక్క వైశాల్యము (చదరపు యూనిట్లలో)
Q80.
In the right angled triangle ABC if AB = AC = 7 units, then the area (in sq. units) of the circumcircle of that triangle is
లంబకోణ త్రిభుజము ABC లో AB = AC = 7 యూనిట్లు అయితే, ఆ త్రిభుజము యొక్క పరివృత్త వైశాల్యము (చదరపు యూనిట్లలో)
AP POLICE (Sub Ibspector) — AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023 (Page 8) | VV Academy