VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 200 (Page 7 of 20)
Q61.
A man takes a total of 11 hours to row 26 kms upstream and 36 kms downstream. Also, he can row 30 kms upstream and 44 kms downstream together in 13 hours. Then the ratio between the speed of the man in still water and speed of the current is
ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేకదిశలో 26 కి. మీ.లు మరియు ప్రవాహ దిశలో 36 కి.మీ.లు ప్రయాణించడానికి మొత్తం 11 గంటలు తీసుకొంటాడు. అతడు ప్రవాహ వ్యతిరేకదిశలో 30 కి. మీ. మరియు ప్రవాహ దిశలో 44 కి.మీ. ప్రయాణించడానికి కలిపి 13 గంటలు తీసుకొంటాడు. అయితే నిలకడగా ఉన్న నీటిలో ఆ వ్యక్తి వేగము మరియు ప్రవాహవేగముల మధ్య నిష్పత్తి
Q62.
A person lent certain amount on simple interest. He lent 50% of that amount at 25% per annum, 40% of the remaining at 10% per annum and the balance at 15% per annum. If he received Rs. 6840 as interest after 2 years, then the amount (in Rs.) he lent at the rate of 10% per annum is
ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట మొత్తాన్ని బారువడ్డీకి ఇచ్చాడు. అతను ఆ మొత్తంలో 50% ధనాన్ని సంవత్సరానికి 25% చొప్పున, మిగిలిన దానిలో 40% ధనాన్ని సంవత్సరానికి 10% చొప్పున మరియు ఇంకనూ మిగిలిన ధనాన్ని సంవత్సరానికి 15% చొప్పున బారువడ్డీపై అప్పుగా ఇచ్చినాడు. రెండు సంవత్సరాల తరువాత అతను రూ. 6,840 లను వడ్డీగా పొందితే, అప్పుడు అతను సంవత్సరానికి 10% చొప్పున వడ్డీకి ఇచ్చిన సొమ్ము
Q63.
The simple interest on Rs. 73,000 for 488 days at 5% per annum (in Rs.) is
రూ. 73,000 లపై 488 రోజులకు సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున అయ్యే బారువడ్డీ (రూ.లలో)
Q64.
A person got Rs. 35 lakhs as his retirement benefits. He divided this into two parts and deposited the amounts for simple interest in the names of his two sons having the ages 12(1⁄2) years and 20 years so that by the time they cross the age of 25 years, each of them will get the same amount. If the rate of simple interest is 10% per annum, the amount (in lakhs of rupees) he deposited in the name of his elder son is
ఒక వ్యక్తి అతని ఉద్యోగవిరమణ సందర్భంగా రూ.35 లక్షలు పొందాడు. ఆ సొమ్మును అతడు రెండు భాగాలుగా చేసి, వాటిని 12(1⁄2) సంవత్సరాలు మరియు 20 సంవత్సరాలు వయస్సుగల తన ఇద్దరు కుమారుల పేర్లతో వారికి 25 సంవత్సరాల వయస్సు నిండేనాటికి వారు సమాన మొత్తమును పొందేటట్లు బారువడ్డీకి డిపాజిట్ చేసినాడు. బారువడ్డీ రేటు సంవత్సరానికి 10% అయితే, అతడు తన పెద్ద కుమారుని పేరుతో డిపాజిట్ చేసిన మొత్తం (లక్షల రూ.లలో)
Q65.
A certain sum Rs. P amounts to Rs. 52,800 in 5 years at a simple interest of 5% per annum and let Rs. S be the total interest accrued for this period. If Rs. C is the interest at the rate of 10% on P for 2 years compounded annually, then S - C =
ఒక నిర్దిష్ట సొమ్ము రూ. P సాలీనా 5% బారువడ్డీతో 5 సంవత్సరాలకు 52,800 రూ.ల మొత్తమౌతుంది మరియు రూ. S అనేది ఈ కాలవ్యవధిలో పోగైన వడ్డీ మొత్తం అనుకోండి. రూ. C అనేది P పై 2 సంవత్సరాలకు 10% చొప్పున సాలీనా లెక్కించిన చక్రవడ్డీ అయితే, అప్పుడు S - C =
Q66.
If the difference between the compound interest computed annually and the simple interest on a certain principal for 3 years at 5% per annum is Rs. 305, then that principal (in Rs.) is
సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి ఒక నిర్ణీత అసలు సొమ్ముపై వచ్చు బారువడ్డీ మరియు సాలీనా గణించిన చక్రవడ్డీల మధ్యగల తేడా రూ.305 అయితే, ఆ సొమ్ము (రూ.లలో)
Q67.
A building of worth Rs. 14,64,100 is constructed on a land of worth Rs. 6,56,100. If the value of the building depreciates at 10% per annum and the value of the land appreciates at 10% per annum, then the time (in years) after which the values of both of them will be equal is
రూ. 6,56,100 విలువ కలిగిన ఒక స్థలంపై రూ. 14,64,100 విలువ గల ఒక భవనము నిర్మించబడింది. భవనం యొక్క విలువ సాలీనా 10% తగ్గుతూ మరియు స్థలం విలువ సాలీనా 10% వంతున పెరుగుతుంటే, వాటి రెండింటి విలువలు సమానంకావటానికి అవసరమయ్యే కాలం (సంవత్సరాలలో)
Q68.
At annual compound interest, Rs. 1,200 becomes Rs. 2,400 in 5 years. The number of years required for the same principal to become Rs. 19,200 at the same rate of annual compound interest is
రూ. 1,200 లను సాలీనా చక్రవడ్డీకి ఇస్తే అది 5 సంవత్సరాలలో రూ. 2,400 అవుతుంది. అదే సాలీనా చక్రవడ్డీరేటుతో అదే అసలు సొమ్ము రూ. 19,200 కావడానికి పట్టే సంవత్సరాల సంఖ్య
Q69.
If the difference between the compound interests obtained by the process of compounding annually and half yearly on a certain sum for 18 months at 10% per annum is Rs. 105, then that sum (in Rs.) is
కొంత సొమ్ముపై 18 నెలలకు 10% సాలీన వడ్డీరేటు చొప్పున సంవత్సరమునకొకసారి చక్రవడ్డీ లెక్కించే పద్ధతిలో మరియు అర్ధ సంవత్సరమునకొకసారి చక్రవడ్డీ లెక్కించే పద్ధతిలో వచ్చే వడ్డీల మధ్య భేదం 105 రూ.లు అయితే, ఆ సొమ్ము (రూ.లలో)
Q70.
A started a business by investing Rs. 18,000 and after three months, B joined him with a capital of Rs. 24,000. From then after six more months, C joined them with a capital of Rs. 36,000. At the end of the year if the share of C in the profit is Rs. 12,000, then the total profit earned (in rupees) is
రూ. 18,000 ల పెట్టుబడితో A వ్యాపారము ప్రారంభించిన మూడు నెలల తరువాత B అనువాడు రూ. 24,000 పెట్టుబడితో ఆ వ్యాపారంలో అతనితో చేరినాడు. ఆ తరువాత మరో ఆరు నెలల అనంతరం, C అనువాడు రూ. 36,000 పెట్టుబడితో ఆ వ్యాపారంలో వారితో చేరినాడు. సంవత్సరాంతమున వచ్చిన లాభంలో C యొక్క వాటా రూ.12,000 అయితే, సంపాదించిన మొత్తం లాభం (రూపాయల్లో)