VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 200 (Page 10 of 20)
Q91.
If five times the present age of a boy is less than his age after nine years, then the present age of that boy can be
ఒక బాలుడి ప్రస్తుత వయస్సునకు 5 రెట్లు తీసుకుంటే అది, తొమ్మిది సంవత్సరాల తరువాత అతని వయస్సు కంటే తక్కువైతే, ఆ బాలుడి ప్రస్తుత వయస్సు
Q92.
The cost of 6 pens and 7 pencils is 51 rupees. By paying two more rupees extra, if we can buy 7 pens and 6 pencils, then the cost (in Rs.) of two pens and two pencils is
6 పెన్నులు మరియు 7 పెన్సిళ్ళ ధర 51 రూ॥లు. మరో 2 రూ॥లు ఎక్కువగా చెల్లించడం వలన మనం 7 పెన్నులు మరియు 6 పెన్సిళ్ళను కొనగలిగితే, అప్పుడు 2 పెన్నులు మరియు 2 పెన్సిళ్ళ ధర (రూ.లలో)
Q93.
If α is the least positive integer and β is the greatest negative integer satisfying the inequality |3x - 5| > 7, then α + β =
|3x - 5| > 7 అనే అసమీకరణాన్ని తృప్తిపరిచే కనిష్ట ధనపూర్ణాంకం α మరియు గరిష్ట ఋణ పూర్ణాంకం β అయితే, అప్పుడు α + β =
Q94.
If the integers α, β and γ satisfy the linear equations a + b + c = 2, 2a + b + 3c = 9 and 3a + 2b + 5c = 14, then 2α + 3β + 4γ =
α, β, γ లు a + b + c = 2, 2a + b + 3c = 9 మరియు 3a + 2b + 5c = 14 లను తృప్తిపరిచే పూర్ణాంకాలయితే, అప్పుడు 2α + 3β + 4γ =
Q95.
A watch gains 20 seconds in every 6 minutes. It was set right at 6 a.m. In the afternoon of the same day if the watch shows 3 hours 30 min., then the actual time is
ఒక గడియారం ప్రతి 6 నిమిషాలకు 20 సెకనులను అదనంగా చూపిస్తుంది. ఉదయం 6 గంటలకు దానిని సరియైన సమయాన్ని చూపేటట్లుగా అమర్చారు. అదే రోజు మధ్యాహ్నం ఆ గడియారం 3 గంటల 30 నిమిషాలను చూపిస్తుంటే, అప్పుడు వాస్తవమైన సమయం
Q96.
A watch which gains uniformly is 10 min. slow when the correct time is 10 a.m. on a day. On the next day it shows 10 min. fast when the correct time is 1:12 a.m. The clock shows correct time at
ఏకరీతిగా సమయాన్ని అదనంగా చూపించే ఒక గడియారం, ఒక రోజు సరి అయిన సమయం ఉదయం 10 గంటలకు, 10 ని॥లు తక్కువ సమయాన్ని చూపిస్తుంది. మరుసటి రోజు సరి అయిన సమయం రాత్రి 1:12 గంటలకు, 10 ని॥లు ఎక్కువ సమయాన్ని చూపిస్తోంది. అయితే ఆ గడియారం యదార్థ సమయాన్ని సూచించేది
Q97.
At what time between 10 and 11 O'clock will the hands of a clock be in the same straight line but not coincident?
ఒక గడియారంలోని రెండుముల్లులు 10 మరియు 11 గంటల మధ్య ఏ సమయంలో ఒకే సరళరేఖలో ఉంటూ, ఒక దానిపై మరొకటి లేకుండా ఉంటాయి?
Q98.
If 10th April of an year is a Friday, then the date on which the second Saturday of May in that year falls is
ఒక సంవత్సరంలో ఏప్రియల్ 10వ తేది శుక్రవారమైతే, ఆ సంవత్సరంలో మే నెలలోని రెండో శనివారం వచ్చే తేది
Q99.
In the year 2008, 9th May was a Friday. The day on February 14th in the same year was
2008 సంవత్సరంలో మే 9వ తేది శుక్రవారం అయింది. అదే సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తేదీన అయ్యేరోజు
Q100.
In a sequence of 12 consecutive odd numbers, if the sum of the first 5 numbers is 425, then the average of these 12 numbers is
12 వరుస బేసిసంఖ్యల శ్రేణిలో, మొదటి 5 సంఖ్యల మొత్తం 425 అయితే, ఆ 12 సంఖ్యల సగటు
AP POLICE (Sub Ibspector) — AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023 (Page 10) | VV Academy