ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన సిలబస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
ఏపీలో గ్రూప్-2 రాత పరీక్ష(Group II exam) లకు సంబంధించి కొత్త సిలబస్ విడుదలైంది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) అభ్యర్థులను ఎంపిక చేయనుంది. మొదటి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్.. ఆ తర్వాత రెండో దఫాలో 300 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు అర్హులవుతారు
ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉండగా.. ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం.. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడగనున్నారు.
ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష విధానం - (150 ప్రశ్నలు ..150 మార్కులు)
భారతదేశ చరిత్ర(ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర)- 30 ప్రశ్నలు.. 30 మార్కులు
భూగోళశాస్త్రం(జనరల్, ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ)- 30 ప్రశ్నలు.. 30 మార్కులు
భారతీయ సమాజం(స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషియల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం)- 30 ప్రశ్నలు.. 30 మార్కులు
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు)- 30 ప్రశ్నలు.. 30 మార్కులు
మెంటల్ ఎబిలిటీ (లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ)-30 ప్రశ్నలు.. 30 మార్కులు
మెయిన్స్ పరీక్ష విధానం (300 ప్రశ్నలు.. 300 మార్కులు)
పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం)- 150 ప్రశ్నలు.. 150 మార్కులు.. 150 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది.
పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ)- 150 ప్రశ్నలు.. 150 మార్కులు.. 150 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది.