[:en]నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్… 15,971 ఖాళీల భర్తీ..[:]

[:en]

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్… 15971 ఖాళీల భర్తీ..

నిరుద్యోగులకు 15971 ఖాళీల  , నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్… 15971 ఖాళీల భర్తీ..నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్... 15,971 ఖాళీల భర్తీ..

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 15,971 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అమరావతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం… గ్రామ సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మినీ గోడౌన్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించిన సీఎం జగన్.. ఉపాధిహామీ నిధులతో స్కూళ్లకు ప్రహారీ గోడలను నిర్మించాలన్నారు. ఇక, ఫిబ్రవరి నుంచి ఇంటి దగ్గరకే పెన్షన్లు వస్తాయని.. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించాలన్న సీఎం జగన్.. పెన్షన్ల కోసం ఎదురుచూపులు లేకుండా చేయాలన్నారు.

ఇక, గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు నిర్మించాలి. అందులో మరో 3,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలు భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు  సీఎం వైఎస్ జగన్.

నిరుద్యోగులకు 15971 ఖాళీల 

[:]

Loading

Comments

comments