VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 200 (Page 3 of 20)
Q21.
x, y, z are three positive integers. If LCM of x, y, z is 45; HCF of x, y, z is 3; LCM of x, y is 9; LCM of y, z is 15; LCM of z, x is 45, then z =
x, y, z లు మూడు ధనపూర్ణాంకాలు. x, y, z ల క.సా.గు. 45; x, y, z ల గ.సా.భా. 3; x, y ల క.సా.గు 9; y, z ల క.సా.గు 15; z, x ల క.సా.గు 45 అయితే, అప్పుడు z =
Q22.
The least perfect square number that is divisible by each of the numbers 16, 20, 24, 32 is
16, 20, 24, 32 సంఖ్యలలో ప్రతిదానిచేత భాగింపబడే కనిష్ట పరిపూర్ణవర్గ సంఖ్య
Q23.
The least number when divided by each of the numbers 5, 6, 8, 9 and 15 leaves the remainder one and is also divisible by 13 is
5, 6, 8, 9 మరియు 15 లలో ప్రతి సంఖ్యచేత భాగించినప్పుడు వచ్చే శేషము 1 అవుతూ 13 చే నిశ్శేషంగాను భాగింపబడే కనిష్ట సంఖ్య
Q24.
If the sum of two positive integers each greater than 37 is 296 and if their H.C.F. is 37, then their difference is
37 కంటే పెద్దవి అయ్యే రెండు ధన పూర్ణాంకాల మొత్తము 296 మరియు వాటి గ.సా.భా. 37 అయితే, అప్పుడు వాటి మధ్యగల భేదము
Q25.
At each corner of a triangular field of sides 26 m, 28 m and 30 m if a Cow is tethered by a rope of length 7 m, then the area (in sq. meters) lying in the triangular region ungrazed by the cows is
26 మీ., 28 మీ. మరియు 30 మీ. భుజములుగా గల త్రిభుజాకారంలో ఉన్న ఒక క్షేత్రం యొక్క ప్రతి శీర్షము వద్ద 7 మీటర్లు పొడవు గల త్రాడుతో ఒక ఆవును కట్టినప్పుడు ఆవులు మేయడానికి వీలు కాని ఆ త్రిభుజములోని ప్రాంతం వైశాల్యం (చ.మీ.లలో)
Q26.
The lengths of the two parallel sides of a trapezium are 28 cm and 40 cm. If the length of each of its other two sides is 12 cm, then the area (in sq. cms) of that trapezium is
ఒక సమలంబ చతుర్భుజం యొక్క రెండు సమాంతర భుజాల పొడవులు 28 సెం.మీ. మరియు 40 సెం.మీ. దాని మిగిలిన రెండు భుజాలు ఒక్కొక్కటి 12 సెం.మీ. పొడవు ఉంటే, అప్పుడు ఆ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం (చ.సెం.మీ.లలో)
Q27.
Water is pumped out of a tank through a circular pipe whose internal diameter is 7 cm and the speed of the flow of water is 12 cm per second. If the rate of flow (cu.cm/sec) of any fluid through a pipe is the product of the speed of fluid (cm/sec) and the area of cross section (sq.cm) of that pipe, then the amount of water (in litres) pumped out in one hour is (1000 cu.cm = 1 litre)
7 సెం.మీ. అంతర వ్యాసం గలిగిన ఒక వృత్తాకార పైపు ద్వారా ఒక చెరువులోని నీటిని బయటకు తోడుతున్నారు మరియు ఆ నీటి ప్రవాహం వేగము సెకనుకు 12 సెం.మీ. ఒక పైపు గుండాపోయే ఏదైనా ద్రవం యొక్క ప్రవాహపు రేటు (ఘన. సెం.మీ./ సెకండు), ఆ ద్రవము వేగము (సెం. మీ. / సెకండు) మరియు ఆ పైపు యొక్క మధ్యచ్ఛేద వైశాల్యము (చ॥సెం.మీ.) ల లబ్దము అయితే, అప్పుడు ఒక గంటలో బయటకు పంపగలిగే నీటి పరిమాణము (లీటర్లలో) (1000 ఘన॥ సెం.మీ = 1 లీటరు)
Q28.
If a solid cone of height 15 cm and base diameter 30 cm is carved out of a wooden sphere of radius 15 cm, then the percentage of wood that is wasted, is
15 సెం.మీ. వ్యాసార్థం కలిగిన చెక్క (కొయ్య) గోళం నుండి 15 సెం.మీ. ఎత్తు మరియు 30 సెం.మీ.ల భూ వ్యాసము గల ఒక ఘన శంఖువును చెక్కితే, అప్పుడు వృధా అయిన చెక్క శాతం
Q29.
If the sum of the radii of two spheres is 10 cm and the sum of their volumes is (22000⁄21) cm3, then the ratio of the surface areas of the two spheres is
రెండు గోళాల వ్యాసార్థాల మొత్తం 10 సెం.మీ. మరియు వాటి ఘనపరిమాణాల మొత్తం (22000⁄21) ఘన సెం.మీ. అయితే, అప్పుడు ఆ రెండు గోళాల ఉపరితల వైశాల్యాల నిష్పత్తి
Q30.
If the volumes of a sphere and a hemi-sphere are equal, then the ratio of their radii is
ఒక గోళం మరియు ఒక అర్ధగోళంల ఘన పరిమాణంలు సమానం అయితే, అప్పుడు వాటి వ్యాసార్థాల నిష్పత్తి