యూపీఎస్సీ ద్వారానే ‘రైల్వే’ ఉద్యోగాల భర్తీ!
రైల్వేల్లోని 8 సర్వీసులను విలీనంచేసి ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వేల్లో ఉద్యోగాలు కోరేవారు ఇకపై యూపీఎస్సీ అభ్యర్థుల మాదిరిగానే ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుది. ఆ తర్వాత వీరు టెక్నికల్ (సివిల్, మెకానికల్, టెలికామ్, ఎలక్ట్రికల్); నాన్‌టెక్నికల్ (పర్సనల్, ట్రాఫిక్) స్పెషాలిటీల్లో ఒకదాన్ని ఎంచుకొని.. ‘IRMS’ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
రైల్వే సర్వీసుల విలీనం
రైల్వే సర్వీసుల విలీనంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆయా అంశాలపై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ క్లారిటీ ఇచ్చారు. క్యాడర్ విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపొందేవరకు రైల్వే అధికారులందరూ స్పెషలైజ్డ్ సర్వీసుల్లో కొనసాగుతారని, సీనియార్టీ విషయంలోనూ ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.