జలియన్ వాలాబాగ్ దురాగతం.. సరిగ్గా 102 ఏళ్ల కిందట 1919 ఏప్రిల్ 13న జరిగింది

జలియన్ వాలాబాగ్ దురాగతం.. సరిగ్గా 102 ఏళ్ల కిందట 1919 ఏప్రిల్ 13న ఏం జరిగింది?

బ్రిటషర్ల‌ దాస్య శృంఖలాల నుంచి భారత మాతకు విముక్తి లభిస్తుందని భావించిన జాతీయోద్యమనాయకులకు ఆంగ్లేయులు రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చి షాక్ ఇచ్చారు.

జలియన్ వాలాబాగ్

ప్రధానాంశాలు:

  • హెచ్చరికలు లేకుండా బ్రిటిష్ సైన్యం కాల్పులు.
  • స్వాతంత్ర పోరాటంలో క్రూరమైన నరమేధం.
  • వందేళ్లు దాటినా కళ్లముందు మెదులాడుతున్న ఘటన.

భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు సైతం ఉన్నారు. జలియన్‌ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ పట్టణంలోని ఓ తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్‌‌కు చేరుకున్నారు.

అయితే, ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చి రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం ఇందులో పాల్గొన్నారు. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే రౌలత్ చట్టాన్ని బ్రిటిషర్లు తీసుకురావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. జలియన్ వాలాబాగ్‌లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.

ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. మొత్తం 50 మంది సైనికులు పది నిమిషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించారు. నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు.

కానీ ఈ ఘటనలో 1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠత్పారిణామానికి నిశ్చేష్ఠులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకేశారు.

నిర్దాక్షిణ్యంగా వందలమంది మరణానికి కారణమైన జనరల్‌ ఓ డయ్యర్‌పై బ్రిటిష్‌ ప్రభుత్వంలోని చాలామంది ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా బ్రిటన్‌ పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యులు ఆ క్రూరుడి చర్యల్ని సమర్థించారు. ‘పంజాబ్‌ రక్షకుడు’ అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. ప్రతినిధుల సభలో మాత్రం డయ్యర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రూరత్వానికి ఒడిగట్టిన అతడిపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం నుంచి తొలగించి… భారత్‌లో మళ్లీ పనిచేయకుండా లండన్‌కు పంపింది. తర్వాత అతడికి ‘సర్‌’ బిరుదుతో సత్కరించింది. 1920లో హంటర్‌ కమిషన్‌ నివేదిక డయ్యర్‌ను, అప్పటి పంజాబ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

అయితే, డయ్యర్‌ భారత్‌ విడిచి వెళ్లిపోయినా అతడ్ని ఉద్యమకారులు వదిలిపెట్టలేదు. మృత్యువులా వెంబడించారు. ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత 1940 మార్చి 13.. సరిగ్గా 81 సంవత్సరాల క్రితం లండన్‌లోని కాక్స్‌ టన్‌ హాలులో ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌, రాయల్‌ సెంట్రల్‌ ఏసియన్‌ సొసైటీ సమావేశం జరుగుతున్నది. ప్రసంగం చేసి వచ్చి జనరల్‌ మైఖల్‌ ఓ డయ్యర్‌ తన సీట్లో కూర్చున్నాడు. అదే సమావేశానికి వచ్చిన సూటూబూటు వేసుకొని హాజరైన గదర్‌ పార్టీ విప్లవ వీరుడు ఉద్దమ్‌సింగ్‌ తన చేతిలో ఉన్న పుస్తకంలో దాచుకున్న తుపాకీ తీసి డయ్యర్‌పై కాల్పులు జరిపాడు. అంతే అక్కడికక్కడే డయ్యర్‌ కన్నుమూశాడు. అక్కడికక్కడే అతణ్ని అరెస్టు చేశారు.

కోర్టులో ఉదంసింగ్ ప్రసంగం

          *నేనే  చేశాను ఈ హత్య ఎందుకు అంటే అతని మీద నాకు పగ  నేను అతనిని చంపే అంత తప్పు చేసాడు నా దెశ ప్రజల ఆత్మ ను భంగపరచాడు అందుకనే వాడిని చంపి వేసాను.          *అందుకోసం 21 సం!! లు వేచి చూసాను  నేను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నాను నేను మరణంకు భయపడలేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను

          *నేను బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఆకలితో ఉన్న నా ప్రజలను చూశాను ఈ విషయంలో నేను నిరసన వ్యక్తం చేశాను, అది నా బాధ్యత నా మాతృభూమి కోసం మరణం కన్నా నాకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది?

          డయ్యర్‌ను చంపిన అభియోగాలపై ఉద్దమ్‌సింగ్‌ను 1940 జూలై 31 న ఉరితీశారు. డయ్యర్‌పై కాల్పులు జరుపడానికి ప్రధాన కారణం జలియన్‌వాలాబాగ్‌లో భారతీయులను సామూహింక కాల్చిచంపడమే అని ఉద్దమ్‌సింగ్‌ తనపై అభియోగాలపై విచారణ సందర్భంగా స్పష్టం చేశారు.

ఉద్దమ్‌సింగ్‌ గురించి

ఉద్దమ్‌సింగ్‌ పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలోని ఓ కాంబోజ్‌ సిక్కు కుటుంబంలో 1899 డిసెంబర్‌ 26 న జన్మించారు. చిన్ననాటనే తల్లిదండ్రులు చనిపోవడంతో సోదరుడితో కలిసి ఆమృత్‌సర్‌లోని అనాథ శరణాలయానికి వచ్చారు. 1918 లో మెట్రిక్యులేషన్‌ పాసైన తర్వాత స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకునేందుకు శరణాలయాన్ని వీడారు. భగత్‌సింగ్‌ చేత తీవ్రంగా ప్రభావితమయ్యారు. గదర్‌ పార్టీలో చేరి విదేశాల్లో ఉన్న భారతీయులను ఒక్కటి చేసి వారిని బ్రిటన్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించేలా చేశారు. 1934 లో కశ్మీర్‌ నుంచి జర్మనీ వెళ్లిన ఉద్దమ్‌సింగ్‌.. కొన్నిరోజులపాటు ఇంజినీర్‌ వద్ద ఉద్యోగం చేశాడు. అక్కడి నుంచి లండన్‌ చేరుకుని డయ్యర్‌ను ఎలా హతమార్చాలి అనే దానిపై ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు. జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతకు ప్రతిగా డయ్యర్‌ను కాక్స్‌టన్‌ హాలులో తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చాడు.

ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో భగత్ సింగ్, రాజ్‍గురు, ఇంకా సుఖదేవ్తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని ఆనాడే భారతదేశపు మొదటి మార్క్సిస్టులుగా పేర్కొనింది. 1940 మార్చి 13న జలియన్ వాలా బాగ్ సంఘటనకు ప్రతీకారంగా ఉద్దం సింగ్ లండన్ కాక్స్‌టన్‌ హాల్‌లో మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు.

 

ఏప్రిల్ 13 న జరిగిన మరికొన్ని ముఖ్య సంఘటనలు :

2013: బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్ జార్జ్ మారియో బెర్గోగ్లియోను రోమన్ కాథలిక్ చర్చికి పోప్‌గా నియామకం

2004: సితార్‌ ప్లేయర్ విలాయత్ ఖాన్ మరణం

1997: మదర్ థెరిసా వారసురాలుగా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సుపీరియర్ జనరల్‌గా ఎన్నికైన సిస్టర్ నిర్మల

1992: టర్కీలో సంభవించిన భూకంపంలో సుమారు 500 మంది దుర్మరణం

1980: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ జననం

1963: క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు తొలిసారి అర్జున అవార్డుల ప్రదానం చేయనున్నట్లు ప్రకటన

1961: బ్రిటన్‌కు చెందిన ముగ్గురు మగ అధికారులు రష్యా కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు

1956: టెస్ట్ క్రికెట్ ఆడే హోదా పొందిన 26 సంవత్సరాల తరువాత మొదటి విజయాన్ని సాధించిన న్యూజిలాండ్‌

1938: ఆస్ట్రియా, జర్మనీల మధ్య ది అన్షల్స్ అనే రాజకీయ సంఘం ఏర్పాటు ప్రకటన

1925: ప్రభుత్వ పాఠశాలల్లో చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని బోధించడాన్ని నిషేధించే బిల్లుకు అమెరికాలోని టేనస్సీ శాసనసభ ఆమోదం

1913: హిందూస్థానీ శాస్త్రీయ సంగీత ప్రసిద్ధ గాయకుడు గంగూబాయి హంగల్ కర్ణాటకలోని ధార్వాడ్‌లో జననం

1881: సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో దారుణహత్యకు గురైన రష్యాకు చెందిన జార్ అలెగ్జాండర్-2

781: అరుణ గ్రహాన్ని కొనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్

 

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.