నిరుద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త అందించింది. దేశ రక్షణ దళంలో ఈ సారి కూడా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. ఈ ఏడాది 39,481 పోస్టులను తాజా నోటిఫికేషన్ కింద భర్తీ కానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ కానున్నాయి.
అర్హతలు
ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చును.
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో వయోపరిమతి ఉండాలి. అలాగే
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు,
ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమతి సడలింపు ఉంటుంది.
జీతం :
తుది నియామకాలు ఖరారు చేసుకుని జనరల్ డ్యూటీ కానిస్టేబుల్గా విధుల్లో చేరిన వారికి ప్రారంభంలోనే పే లెవల్-3తో వేతనం అందిస్తారు. అంటే నెలకు రూ.21,700-రూ.69,100తో నెల వేతన శ్రేణి అందుకోవచ్చు.
మూడు దశల ఎంపిక ప్రక్రియ ఇలా..
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్ట్లకు సంబంధించి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అవి..
1.రాత పరీక్ష,
2.ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,
3.ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్.
\ఈ మూడు దశల తర్వాత డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్లను కూడా నిర్వహిస్తారు.
160 మార్కులకు రాత పరీక్ష ఇలా
కానిస్టేబుల్ పోస్ట్ల ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 160 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ -ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/హిందీ 20 ప్రశ్నలు-40 మార్కులకు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు-160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు.
ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష :
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ (జీడీ) పరీక్షను హిందీ, ఇంగ్లిష్తోతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో (అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ) నిర్వహిస్తారు.
పీఎస్టీ/పీఈటీ :
తొలిదశ రాత పరీక్ష తర్వాత అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లను నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు అర్హత పొందాలంటే..రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందాలి. జనరల్ కేటగరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 25 శాతం మార్కులు, ఇతర రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు 20 శాతం మార్కులు పొందాలి.