గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా….?

 

గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

71 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు …

  ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే “జాతీయ పండుగ” దినం.
  • భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.
  • భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యము వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది.
  • రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
  • భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది.
1930 జనవరి 26 న పూర్ణ స్వరాజ్ కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావటంతో 26 జనవరిని ఎంపిక చేశారు 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్‌)గా ప్రకటించబడింది. ప్రస్తుతం 448 ఆర్టికల్స్‌, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 124 సవరణలతో కూడినది ఈ భారత దేశ బృహత్‌ రాజ్యాంగం..
  • రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.
  • రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
  • భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.
  • 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.
  • 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.
  • మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి.
  • రాజ్యంగ పరిషత్ క్యాలిగ్రాఫర్-ప్రేమ్ బిహారీ నారాయణ రిజ్దా.
  • ప్రావేశికకు art work చేసింది. నందనలాల్ బోస్.
  • మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.
  • 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేఛ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు.
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి.
  1. ఏక పౌరసత్వం   —  బ్రిటన్
  2. పార్లమెంటరీ విధానం — బ్రిటన్
  3. స్పీకర్ పదవి  —  బ్రిటన్
  4. ప్రాథమిక హక్కులు  — అమెరికా
  5. సుప్రీం కోర్టు  —  అమెరికా
  6. న్యాయ సమీక్షాధికారం  —  అమెరికా
  7. భారతదేశంలో ఆదేశిక సూత్రాలు  —  ఐర్లాండ్
  8. రాష్ట్రపతి ఎన్నిక పద్దతి  —  ఐర్లాండ్
  9. రాజ్యసభ సభ్యుల నియామకం  —  ఐర్లాండ్
  10. భారతదేశంలో ప్రాథమిక విధులు  —  రష్యా
  11. కేంద్ర రాష్ట్ర సంబంధాలు  —  కెనడా
  12. అత్యవసర పరిస్థితి  —  వైమర్(జర్మనీ)
కమిటీలు చైర్మన్లు
  • నియమ నిబంధనల కమిటీ – డా.బాబు రాజేంద్ర ప్రసాద్
  • రాజ్యాంగ సారథ్య సంఘం – డా. బాబు రాజేంద్రప్రసాద్
  • స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ – డా. బాబు రాజేంద్రప్రసాద్
  • జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ – డా. బాబు రాజేంద్రప్రసాద్
  • ముసాయిదా కమిటీ – బి ఆర్అంబేద్కర్
  • రాజ్యాంగ సలహా సంఘం – సర్దార్ వల్లభభాయి పటేల్
  • ప్రాథమిక హక్కుల కమిటీ – సర్దార్ వల్లభ బాయ్ పటేల్
  • అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ – సర్దార్ వల్లభ బాయ్ పటేల్
  • రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ – సర్దార్ వల్లభ బాయ్ పటేల్
  • ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ – జేబీ కృపలాని
  • అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ – హెచ్‌సీముఖర్జీ
  • యూనియన్ పవర్స్ కమిటీ -జవహర్‌లాల్ నెహ్రూ
  • కేంద్ర రాజ్యాంగ కమిటీ – జవహర్‌లాల్ నెహ్రూ
  • కేంద్ర అధికారాల కమిటీ – జవహర్‌లాల్ నెహ్రూ
  • సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ -వరదాచారి
  • ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ – కేఎంమున్షీ
  • ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
  • హౌస్ కమిటీ – భోగరాజుపట్టాభి సీతారామయ్య
  • పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ – జీవీమౌలాంకర్
 

దేశాలు -గణతంత్ర దినోత్సవం జరుపుకొనే రోజు

దేశం పేరు
గణతంత్ర దినోత్సవం 
జరుపుకొనే రోజు
ఇటలీ
జూన్ 2
చైనా
అక్టోబర్ 10
రొడీషియా
అక్టోబరు 24
కజకిస్తాన్
అక్టోబరు 25
మాల్దీవులు
నవంబర్ 11
బ్రెజిల్
నవంబర్ 15
యుగోస్లేవియా
నవంబర్ 29
మాల్టా
డిసెంబరు 13
నైజర్
డిసెంబరు 18
రొమానియా
డిసెంబరు 8
అల్బేనియా
జనవరి 11 (1946)
ఆర్మేనియా
మే 28 (1918)
అజర్‌బైజాన్
మే 28 (1918)
బుర్కినా ఫాసో
డిసెంబరు 11 (1958), 
అప్పర్ వోల్టా ఫ్రెంచి 
సమూహంలో 
రిపబ్లిక్ అయినది.)
తూర్పు జర్మనీ
అక్టోబరు 7
గాంబియా
ఏప్రిల్ 24 (1970)
గ్రీసు
జూలై 24 (1974)
ఘనా
జూలై 1 (1960)
గయానా
ఫిబ్రవరి 23 (1970, 
ఇంకో పేరు 
మష్ర్‌మాని)
ఐస్‌లాండ్
జూన్ 17 (1944)
ఇరాన్
ఏప్రిల్ 1 ఇస్లామిక్ 
రిపబ్లిక్ డే
ఇరాక్
జూలై 14
కెన్యా
డిసెంబరు 12 (1963, 

జమ్‌హూరి దినం.)
లిథువేనియా
మే 15 (1920, 
ఇంకో పేరు 
లిథువేనియా 
రాజ్యాంగ శాసనసభ 
దినము)
మాల్దీవులు
నవంబర్ 11 (1968)
నేపాల్
మే 28 (2008)
నైగర్
డిసెంబరు 18 (1958)
ఉత్తర కొరియా
సెప్టెంబరు 9 (1948)
పాకిస్తాన్
మార్చి 23 (1956)
పోర్చుగల్
నవంబర్ 15 (1991)
సియెర్రా 
లియోన్
ఏప్రిల్ 27, (1961)
ట్యునీషియా
జూలై 25, (1957)
టర్కీ
అక్టోబరు 29 (1923)
Total reads
0

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.