VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Average Ages
Arithmetic · Averages · Averages

Average Ages

118 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 118 (Page 1 of 12)
1
Q1.
The average age of a family of 6 members 4 years ago was 25 years. Meanwhile a child was born in this family and still the average age of the whole family is same today. The present age of the child is:
4 సంవత్సరాల క్రితం 6 గురు సభ్యులు గల కుటుంబం సగటు వయస్సు 25 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో ఒక బిడ్డ జన్మించినప్పటికీ నేడు కుటుంబ సగటు వయస్సు అలాగే ఉంది. బిడ్డ ప్రస్తుత వయస్సు ఎంత?
Q2.
The average age of 3 friends is 23 years. Even if the age of 4th friend is added, the average age remains the same. Then the age of the fourth friend is:
ముగ్గురు స్నేహితుల సగటు వయస్సు 23 సంవత్సరాలు. 4వ స్నేహితుడి వయస్సును కలిపినా సగటు వయస్సు అలాగే ఉంది. అయితే నాల్గవ స్నేహితుడి వయస్సు ఎంత?
Q3.
In a family, the average age of a father and a mother is 35 years. The average age of the father, mother and their only son is 27 years. What is the age of the son?
ఒక కుటుంబంలో తల్లిదండ్రుల సగటు వయస్సు 35 సంవత్సరాలు. తల్లిదండ్రులు మరియు వారి ఏకైక కుమారుడి సగటు వయస్సు 27 సంవత్సరాలు అయితే, కుమారుడి వయస్సు ఎంత?
Q4.
A family consists of grandparents, parents and three grandchildren. The average age of the grandparents is 67years, that of the parents is 35 year and that of the grandchildren is 6 years. What is the average age of the family?
ఒక కుటుంభం లో సభ్యులు ; grand parents; parents; 3 grandchildren. Grand parents సగటు వయసు 67సం. Parents ది 35సం. Grand children ది 6 సం. కుటుంబం సగటు వయసు?
Q5.
The average age of 9 students and their teacher is 16 years. The average age of the first four students is 19 years and that of the last five is 10 years. The teacher's age is:
9 మంది విద్యార్థులు మరియు వారి ఉపాధ్యాయుని సగటు వయస్సు 16 సంవత్సరాలు. మొదటి నలుగురు విద్యార్థుల సగటు వయస్సు 19 సంవత్సరాలు మరియు చివరి ఐదుగురి సగటు వయస్సు 10 సంవత్సరాలు అయితే, ఉపాధ్యాయుని వయస్సు ఎంత?
Q6.
From a class of 42 boys, a boy aged 10 years goes away and in his place, a new boy is admitted. If on account of this change, the average age of the boys in that class increases by 2 months, the age of the newcomer is:
42 మంది బాలుర తరగతి నుండి 10 సంవత్సరాల బాలుడు వెళ్లిపోయి అతని స్థానంలో కొత్త బాలుడు చేరాడు. ఈ మార్పు వల్ల తరగతి బాలుర సగటు వయస్సు 2 నెలలు పెరిగితే, కొత్తగా వచ్చిన బాలుడి వయస్సు ఎంత?
Q7.
The average age of husband, wife and their child 3 years ago was 27 years and that of wife and the child 5 years ago was 20 years. The present age of the husband is:
3 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు మరియు వారి బిడ్డ సగటు వయస్సు 27 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల క్రితం భార్య మరియు బిడ్డ సగటు వయస్సు 20 సంవత్సరాలు. అయితే భర్త ప్రస్తుత వయస్సు ఎంత?
Q8.
The average age of 30 students of a class is 14 years 4 months. After admission of 5 new students in the class the average becomes 13 years 9 months. The youngest one of the five new students is 9 years 11 months old. The average age of the remaining 4 new students is:
ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సగటు వయస్సు 14 సంవత్సరాల 4 నెలలు. 5 మంది కొత్త విద్యార్థులు చేరిన తర్వాత సగటు 13 సంవత్సరాల 9 నెలలు అయింది. ఐదుగురు కొత్త విద్యార్థులలో చిన్నవాడి వయస్సు 9 సంవత్సరాల 11 నెలలు అయితే, మిగిలిన 4 గురు కొత్త విద్యార్థుల సగటు వయస్సు ఎంత?
Q9.
Numbers of boys and girls are 'x' and 'y' respectively. Ages of a girl and a boy are 'a' years and 'b' years respectively. The average age (in years) of all boys and girls is:
బాలురు మరియు బాలికల సంఖ్య వరుసగా 'x' మరియు 'y'. ఒక బాలిక మరియు ఒక బాలుడి వయస్సు వరుసగా 'a' సంవత్సరాలు మరియు 'b' సంవత్సరాలు అయితే, అందరు బాలురు మరియు బాలికల సగటు వయస్సు ఎంత?
Q10.
When the average age of a husband and wife and their son was 42 years, the son got married and a child was born just one year after the marriage. When child turned to be five years then the average age of family became 36 years. What was the age of daughter-in-law at the time of marriage?
భార్యాభర్తలు మరియు వారి కుమారుడి సగటు వయస్సు 42 సంవత్సరాలు ఉన్నప్పుడు కుమారుడికి వివాహమైంది, వివాహమైన ఒక సంవత్సరం తర్వాత ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు ఐదేళ్లు నిండినప్పుడు కుటుంబ సగటు వయస్సు 36 సంవత్సరాలు అయింది. వివాహ సమయంలో కోడలి వయస్సు ఎంత?