Railway Recruitment Board (RRB) has officially released the RRB Group D Notification 2025 for over 32438 vacancies across India. Candidates aspiring for a stable and prestigious railway job can now check the eligibility criteria, important dates, syllabus, and application process below.
రైల్వేలో 32,438 గ్రూప్-డి లెవెల్-1 పోస్టులు
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో
తదితర ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది
అర్హత
పదో తరగతి
లేదా
ఐటీఐ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత
వయోపరిమితి
01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
UR/EWS : 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి
OBC (Non-Creamy Layer) : 18 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉండాలి
SC/ST: 18 నుంచి 41 సంవత్సరాల మధ్య ఉండాలి
పుట్టిన తేదీ గరిష్ట పరిమితి (ఈ క్రింది తెలిపిన తేదీ కంటే ముందు ఉండకూడదు)