VV Academy

India Post GDS Recruitment 2023-కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా 30,041 ఉద్యోగాలు

India Post GDS Recruitment 2023:

జస్ట్‌ పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా  30,041 ఉద్యోగాలు… నాలుగు లేదా ఐదు గంటలే పని..

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 1058,

తెలంగాణలో 961… 

దేశవ్యాప్తంగా మొత్తం 30,041 పోస్టులు ఉండగా… తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 1058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగానికి ఎంపికైతే రోజులో కేవలం నాలుగు లేదా ఐదు గంటలు మాత్రమే పని ఉంటుంది. ఈ వర్క్‌తో పాటు ఇండియన్‌  పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ అందిస్తారు. విధులు నిర్వర్తించడానికి  అవసరమైతే ల్యాప్‌టాప్‌ తపాలా శాఖ సమకూరుస్తుంది. సైకిల్‌ తొక్కడం కచ్చితంగా వచ్చి ఉండాలి. 

వయస్సు :

  • ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు అలాగే.. 40 ఏళ్లకు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. 

జీతం:

  • బీపీఎం పోస్టులకు రూ.12,000–రూ.29,380;
  • ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ పోస్టులకు రూ.10,000–రూ.24,470 మధ్య వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు.
  • మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.

ఎంపికైన వారు

  • బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలు చూసుకుంటూ… పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌  పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి.
  • డాక్‌ సేవక్‌: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 03.08.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 23.08.2023.

దరఖాస్తు సవరణలకు అవకాశం: 24.08.2023 నుంచి 26.08.2023 వరకు.

Comments

comments

Exit mobile version